దర్శకుడితో ఎఫైర్, లేచిపోవడం గురించి హరితేజ..?

P.Nishanth Kumar
పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హరితేజ.. అయితే ఆమె కు బ్రేక్ ఇచ్చింది మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ.. సినిమానే.. అది సినిమా తోనే హరితేజ మంచి గుర్తింపు తో పాటు క్రేజ్ ని కూడా దక్కించుకుంది.. అంతకుముందు వందలకొద్దీ సీరియల్స్ చేసినా ఆమెకు పెద్ద గా గుర్తింపు అయితే రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా పాల్గొన్న హరితేజ కొద్దో గొప్పో గుర్తింపు దక్కించుకుని ప్రస్తుతం వెండితెరపైనే, బుల్లితెరపైనా దూసుకుపోతుంది. అంతేకాదు ఓ సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అందులో షేర్ చేస్తూ బాగా సంపాదిస్తుంది కూడా..

ఇక ఆమె కు అవకాశాలు ఎన్నున్నా ఆమెపై రూమర్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి.. బేసిక్ గా నటి అంటేనే ఆమెపై గాసిప్స్ ఎక్కువగా వస్తుంటాయి.. అవి అందులో నిజం లేదని చాలామందికి తెలిసినా నిప్పు లేనిదే పొగ రాదు అనే సామెత కూడా మనం మర్చిపోవద్దు.. ఇకపోతే హరితేజ విషయంలో తనపై వచ్చిన రూమర్స్ కి ఆమె క్లారిటీ ఇచ్చేదాకా అవన్నీ పుకార్లే అని ఎవరికీ తెలీదు. ఇంతకీ ఆమె ఏమన్నదీ అంటే...

చిన్నారి సీరియల్ తరువాత లోగిలి అనే సీరియల్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్‌తో నాకు సంబంధం ఉందని.. మా ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని కొన్ని లక్షల గాసిప్‌లు వచ్చాయి. అప్పుడే నేను ఇండస్ట్రీకి రావడం వల్ల.. ఇలాంటివి నాకు కొత్త కావడం వల్ల ఆ గాసిప్ నాకు చాలా హార్ట్ బ్రేకింగ్‌గా అనిపించింది. మా ఇంట్లో వాళ్లైతే.. తిరిగి వెళ్లిపోవడానికి డిసైడ్ అయిపోయారు. అలాంటి సందర్భంలో నాకు మూడు నెలలు గ్యాప్ వచ్చింది. ఎలాంటి ప్రాజెక్ట్‌లు చేయలేదు. మా అమ్మమ్మకి హెల్త్ బాలేకపోవడంలో అటూ ఇటూ తిరిగడం వల్ల.. సీరియల్స్ గ్యాప్ వచ్చింది. ఆ టైంలోనే మనసు మమత సీరియల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చాలామంది అనుకున్నారు.. నేనూ ఆ దర్శకుడు లేచిపోయి పెళ్లి చేసేసుకున్నాం అని.. నిజం తెలుసుకుని తనపై పుకార్లు రాస్తే మంచిదని ఆమె వాపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: