రామ్ చరణ్ భలే మేనేజ్ చేస్తున్నాడే..?
ఇకపోతే ‘ఆచార్య’ కోసం ‘సిద్ధ’ అవతారం ఎత్తిన రామ్ చరణ్ సెట్స్‌లోకి అతడికి స్వాగతం పలుకుతూ దర్శకుడు కొరటాల శివ మెడలో రుద్రాక్ష మాలతో ఉన్న చరణ్ చిత్రాన్ని వెనుక నుంచి షేర్ చేశాడు. ఈ లుక్ అభిమానులకు ఐ ఫీస్ట్ ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమా చిత్రీకరణ కూడా ఎక్కువగా టెంపుల్ సెట్ నేపథ్యంలోనే సాగుతోందన్నదీ స్పష్టం. చరణ్ క్యారెక్టర్, లుక్ పరంగా ‘ఆధ్యాత్మిక’ కోణం ఉంటుందని తెలుస్తోంది. మొన్న రిలీజ్ చేసిన లుక్ కూడా ఈ దిశగా సంకేతాలు ఇచ్చింది. కొత్త లుక్ కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి బ్రేక్ తీసుకుని చరణ్ ‘ఆచార్య’ కోసం పని చేస్తున్నట్లే అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఇంతలో రాజమౌళి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైందని.. సీతారామరాజు, కొమరం భీమ్ కలిసి తమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. వైరల్ అయిన ఈ ట్వీట్ మెగా అభిమానులను కన్ఫ్యూజన్లో పడేసింది. ఈ మధ్యే ‘ఆచార్య’ షూట్‌కు వచ్చిన చరణ్.. ఇంతలో మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సెట్లోకి ఎలా అడుగు పెట్టాడన్నది వాళ్ల డౌట్. ‘ఆర్ఆర్ఆర్’ ఏమో వందేళ్ల వెనుకటి నేపథ్యంలో సాగే కథ. ‘ఆచార్య’ వర్తమానం సాగే స్టోరీ. మహా అయితే కొన్నేళ్లు వెనక్కి వెళ్తారు కానీ.. ‘ఆర్ఆర్ఆర్’లా శతాబ్దం అయితే వెనక్కి వెళ్లే అవకాశం లేదు. అలాంటపుడు ఈ రెండు చిత్రాల్లో చరణ్ ఒకేసారి నటిస్తూ లుక్, కాల్ షీట్స్, ఇతర విషయాల్లో ఎలా మేనేజ్ చేయగలుగుతాడో అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.