హర్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ...కారణం ఇదేనా...?

VAMSI
ప్రముఖ అగ్ర సంగీత దర్శకులలో మణి శర్మ ఒకరు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అందించడంలో ది బెస్ట్ అనిపించుకున్నారు మణిశర్మ. మెలోడి బ్రహ్మగా పేరుగాంచిన  ఈ సంగీత దర్శకుడు  ఒకప్పుడు టాలీవుడ్‌ను తన ట్యూన్లతో టాప్ పొజిషన్ లో ఉంచారు. పెద్ద హీరోల సినిమా అంటే మణిశర్మ సంగీతం కంపల్సరీ. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబులకైతే మణిశర్మ అందించిన మ్యూజికల్ హిట్స్ కోకొల్లలు అనే చెప్పాలి. రికార్డులు తిరగరాసిని ఎన్నో సినిమాలకు మణిశర్మ సంగీతం హైలెట్ గా నిలిచింది.

 కానీ ఈ మధ్య కాలంలో యువ సంగీత దర్శకులు తమన్, దేవిశ్రీ ప్రసాద్ ల వలన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం అదే స్పీడ్  మెయింటెన్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రముఖ సంగీత దర్శకుల లిస్టులో మణిశర్మ పేరు కొనసాగుతూనే ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో మణిశర్మ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. మంచి ఫాస్ట్ బీట్లతో పాటు మెలోడీలను అందించారు. ఈ సినిమాతో మణిశర్మ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. దీంతో తిరిగి పెద్ద హీరోల నుంచి ఆయనకు మళ్లీ ఆఫర్లు మొదలయ్యాయి. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న మణిశర్మ కు ఓ చేదు అనుభవం ఎదురవడం ఆయన అభిమానులను ఆందోళన పెట్టింది.

వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం నారప్ప. తమిళ్ లో ఘన విజయం సాధించిన ‘అసురన్’కు ఇది రీమేక్. తెలుగులో
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా నారప్ప సినిమాకు సంబంధించి ఇటీవల ఓ టీజర్ ఇటీవలే విడుదలై సోషల్ మీడియా లో సందడి చేస్తోంది.అయితే.. ఒరిజినల్ వెర్షన్ “అసురన్” నేపథ్య సంగీతాన్ని మణిశర్మ ప్రమేయం లేకుండా యాడ్ చేసి విడుదల చేశారట మేకర్స్. అంతేకాకుండా.. మణిశర్మ పేరు కూడా ఉందట.
దీంతో.. తమిళ్ ‘అసురన్’ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను మణిశర్మ కాపీ కొట్టాడని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు సంబంధించిన ప్రతి చిన్న అంశానికి అదిరిపోయేలా అందించగల మణిశర్మ కు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో ఆయన అభిమానులు సన్నిహితులు శ్రేయోభిలాషులు బాధపడుతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: