ఆసక్తిరేపుతున్న యష్ కామెంట్స్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ సినిమాతో  దేశమంతటా విపరీతమైన క్రేజ్ ని సంపాదించాడు.అప్పటిదాకా చిన్న సినిమా ఇండస్ట్రీ గా వున్న కన్నడ పరిశ్రమ ని దేశం మొత్తం తెలిసేలా చూశాడు.ఇక ఇప్పుడు యష్  నటించబోతున్న ‘కె.జి.ఎఫ్2’ సినిమా  పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలయ్యి యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఆల్మోస్ట్ సినిమా హిట్ అయిందని అందరు ఫిక్స్ అయిపోయారు. ఇదిలా  ఉండగా… ఇటీవల  యష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు యష్. రాకింగ్ స్టార్ మాట్లాడుతూ.. ‘గోల్డ్ మైన్స్ గురించి అలాగే మరే ఇతర విషయాల గురించైనా మనకు తెలియని వాటిని ‘కె.జి.ఎఫ్2′ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కేజీఎఫ్2 కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు అలాగే సిద్దం చేస్తున్నాడు’ అంటూ కె.జి.ఎఫ్2 సినిమా గురించి చెప్పుకొచ్చాడు. అటు తరువాత సౌత్ హీరోల గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన  కామెంట్స్ చేసాడు.
 ‘సౌత్ హీరోలందరూ మల్టీ ట్యాలెంటెడ్ అయ్యుండాలి. పాన్ ఇండియా స్టార్ అవ్వాలంటే అనేక భాషల్లో సినిమా చెయ్యాల్సి ఉంటుంది.కాబట్టి అన్ని భాషల పైనా పట్టు సాధించి  ఉండాలి. అంతేకాదు ఫైట్స్, డాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ఆరితేరి  ఉండాలి. ప్రతి పాత్రకు సూట్ అయ్యేలా లుక్ ను మార్చుకోవడం అనేవి మినిమం క్వాలిటీస్ గా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటూ రాకింగ్ స్టార్ యష్ కామెంట్స్ చేశాడు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: