లారెన్స్ తమ్ముడితో నాకు ప్రాణ భయం ఉందంటూ సీఎం కి లేఖ రాసిన ప్రముఖ నటి.. ఎవరో తెలుసా..??

Anilkumar
సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా లారెన్స్ మాస్టర్ కు ఎంత మంచి పేరుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో లారెన్స్ మాస్టర్ కి ఉన్న క్రేజ్ మరే కొరియోగ్రాఫర్ కి లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..కేవలం డాన్స్ మాస్టర్ గానే కాదు ఓ డైరెక్టర్ గా కూడా లారెన్స్ కి మంచి గుర్తింపు ఉంది తెలుగులో.. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి తో మొదలుకొని మన ఈతరం హీరోలందరి సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన ఈయన.. ఆ తర్వాత దర్శకుడుగా మారి సక్సెస్ అయ్యారు..ఇక హార్రర్ సినిమాలు తీయడంలో లారెన్స్ మించినవారు లేరనే చెప్పాలి..
ఇక తాజగా కాంచన3 సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసిన మన లారెన్స్ మాస్టర్ కు తన సోదరుడి వల్ల ఓ తీవ్ర సమస్య తలెత్తింది.. ఇక తాజగా  లారెన్స్ సోదరుడు ఎల్విన్‌తో ప్రాణభయం ఉందని వర్థమాన సినీ నటి దివ్య ఏబీఎన్‌ను ఆశ్రయించింది. పోలీసులతో కుమ్మక్కై తనను అంతమొందించాలని చూస్తున్నారని ఫిర్యాదుతో పేర్కొంది. వరంగల్‌లోని ఏబీఎన్ కార్యాలయానికి దివ్య వచ్చింది. హైదరాబాద్ పోలీసు అధికారి రవీందర్ రెడ్డితో ప్రత్యేక నెట్ వర్క్ పెట్టుకుని... తనను వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. గతంలోనే ఈ వ్యవహారాన్ని ఏబీఎన్ వెలుగులోకి తెచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను ఆశ్రయించినా ఫలితం లేదని దివ్య తెలిపింది.
గతంలో ఏం జరిగిందంటే.. సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్‌ తమ్ముడు ఎల్విన్‌ అలియాస్‌ వినోద్‌, ఏసీపీ రవీందర్‌రెడ్డి తన జీవితాన్ని నాశనం చేశారని తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్సర్‌గా, జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్న దివ్య ఆరోపించింది. ప్రేమ పేరుతో ఎల్విన్‌ వేధింపులకు గురిచేస్తే.. తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సింది పోయి నాటి మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌, ప్రస్తుత ఏసీపీ రవీందర్‌ రెడ్డి, ఎల్విన్‌తో కలిసి ఆరేళ్లుగా తనను వేధిస్తున్నాడని వాపోయింది. తనను బ్రోతల్‌ కేసులో ఇరికించి 21 రోజులు జైల్లో ఉండేలా చేశారని కన్నీరు పెట్టుకుంది. ఎల్విన్‌, రవీందర్‌రెడ్డి నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం పంపినట్లు వెల్లడించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: