స్నేహా ని మొదటి సారి రాత్రి 2 గంటలకు అలా చూసి షాక్ అయ్యా.. భార్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్..!!

Anilkumar
ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమంతా.. ఇప్పుడు డిజిటల్ రంగాల్లో తన జోరు చూపిస్తూ బిజీ బిజీగా మారిపోతుంది.. ఈ అక్కినేని కోడలు ప్రస్తుతం..ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన ఆహా యాప్ కోసం సామ్ జామ్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే..ఈ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్.. అందులో ఇప్పటికే ఎంతో మంది తారలను ఇంటర్వ్యూ చేసింది.విజయ్ దేవరకొండ, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, క్రిష్ తదితరులు ఈ టాక్ షో లో పాల్గొన్నారు.. ఇక ఇటీవలే క్రిస్మస్ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసిన ఇంటర్వ్యూను అందుబాటులోకి తెచ్చారు.
సమంత అడిగిన ఎన్నో ప్రశ్నలకు బన్నీ సమాధానాలు చెప్పాడు. ఆ క్రమంలో బన్నీ తన వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంగతులు, చిన్ననాటి అల్లరి పనులు ఇలా ఎన్నింటి గురించో చెప్పాడు. తన పిల్లలపై ప్రేమ, భార్యపై ఉన్న ప్రేమను బయట పెట్టేశాడు.అయాన్ గురించి బన్నీ మాట్లాడుతూ.. నాకు అయాన్ అంటేనే ఇష్టం.. అయాన్‌తోనే ఎక్కువగా ఉంటాను.. కానీ అయాన్‌కు కెమెరాలన్నా, ఫోటోలు తీయడమన్నా నచ్చదు. కానీ అర్హ మాత్రం వెంటనే వచ్చేస్తుంది.. అందుకే అన్ని ఫోటోలు అర్హతోనే ఉంటాయి.. అందరూ అర్హ అంటేనే ఇష్టమని అనుకుంటారు.. కానీ అయాన్ అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చాడు.అల్లు స్నేహారెడ్డిలో మీకు నచ్చింది ఏమిటి అని సమంత బన్నీని అడిగింది. ఆమెలో డిగ్నిటీ నాకు చాలా నచ్చిందంటూ బన్నీ ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.
నేను మొదటి సారిగా స్నేహాను నైట్ క్లబ్ పార్టీలో చూశాను అంటూ మొదటి చూపుల గురించి చెప్పాడు.నైట్ క్లబ్ పార్టీలో చూశాను.. అంత మందిలోనూ ఎంతో డిగ్నిటీగా కనిపించింది.. రాత్రి రెండు అవుతున్నా కూడా అంతే పద్దతిగా కనిపించింది.. ఏ మాత్రం అసభ్యకరంగా కనిపించలేదు.. తనలో నాకు అదే నచ్చింది అంటూ స్నేహారెడ్డి గురించి బన్నీ చెప్పుకొచ్చాడు..ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.. ఇక బన్నీ ప్రస్తుతం..సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది...!!




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: