బాలయ్యతో సినిమా చేసే ఇలా అయిపోయాను అంటూ..బాలయ్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ తనూ శ్రీ..??

Anilkumar
నట సింహ నందమూరి బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్లకు కూడా ఏంతో ఇంపార్టెన్స్ ఉంటుంది..దర్శకులు మన బాలయ్య పాత్రను ఎంత పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తారో.. అలానే ఆయన పక్కన నటించే హీరోయిన్ల విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.. అయితే ఇప్పుడు మన బాలయ్యతో గతంలో నటించిన హీరోయిన్ మాత్రం.. ఆయనతో సినిమా చేయడం వల్లనే తాను ఇలా ఐపోయానంటూ అంటోంది..ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.." బాలయ్యతో నటించిన వీరభద్ర సినిమా గురించి పదిహేనేళ్ల తర్వాత గుర్తు చేసింది బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్త. ఈ భామ తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా అది కూడా వీరభద్రనే. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. కానీ మళ్లీ తెలుగు వైపు తిరిగి చూడలేదు.
 తెలుగు మేకర్స్ కూడా ఆమెను సంప్రదించలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అమ్మడి లయ్యతో సినిమా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడింది.అంతేగాక బాలయ్యతో సినిమా చేస్తే లావు అవుతారు అంటూ షాకిచ్చింది.ఇప్పుడు మళ్లీ కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దామని చూస్తుందట తనుశ్రీ. ఈ అమ్మడు కాస్టింగ్ కౌచ్ పై ఆరోపించడం వలన బాలీవుడ్ లో అవకాశాలు రాక ఖాళీగా ఉంటోందట. అందుకే ఇప్పుడు మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెడదాం అనేసి టాలీవుడ్ వైపు తిరిగి చూస్తోంది. అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఆకాశంలో పెడుతోంది. బాలీవుడ్ కంటే కంటెంట్ పరంగా టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా బెటర్ అంటోంది. ఇక తనకు పాపులారిటీ తెచ్చింది కూడా తెలుగు సినిమానే అంటోంది.
 బాలయ్య పక్కన హీరోయిన్ గా చేసినప్పుడు చాలా లావు అయ్యానని అంటోంది. మంచి క్యారెక్టర్స్ వస్తే టాలీవుడ్ లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అలాగే హీరోయిన్ పాత్రలే కాకుండా కంటెంట్ నచ్చితే విలన్ వదిన పాత్రలు చేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదంటోంది. వీరభద్ర సినిమా టైంలో రోజు బాలయ్య ఇంటి భోజనం వచ్చేదని అది తినే నేను 5కిలోల బరువు పెరిగిందట. ఇక ప్రస్తుతం అవకాశం కోసం ఎదురు చూస్తుంది తనూ శ్రీ.. ప్రస్తుతం మన బాలయ్య పై ఈమె చేసిన వ్యాఖ్యలతో.. హీరోయిన్ల పట్ల మన బాలయ్య  ఎంత గౌరవం తో ప్రవర్తిస్తారో మరో సారి రుజువైందనే చెప్పాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: