రామ్ 'రెడ్' ఇస్మార్ట్ ట్రీట్ కంటిన్యూస్..!

shami
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పూరీ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరీ, రామ్ ఇద్దరు కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైం లో సూపర్ హిట్ అందించిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాతో నిధి అగర్వాల్, నభా నటేష్ లకు క్రేజ్ పెరిగింది. నభా నటేష్ అయితే వరుస సినిమాలతో దుమ్ముదులిపేస్తుంది. ఇక రామ్ ఆ సినిమా తర్వాత కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం రీమేక్ చేస్తున్నాడు. రెడ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ డ్యుయల్ రోల్ తో అలరిస్తాడని తెలుస్తుంది.

ఇక రామ్ రెడ్ సినిమా నుండి డించక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఫుల్ మాస్ మసాలా సాంగ్ గా వచ్చిన ఈ సాంగ్ లో కుమార్ హెబ్భా పటేల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈమధ్య పెద్దగా అవకాశాలు లేని హెబ్భా పటేల్ వచ్చిన ఏ చిన్న ఛాన్స్ కూడా వదలట్లేదు. రెడ్ సినిమాలో కూడా రామ్ తో అమ్మడు ఓ రేంజ్ లో ఆడిపాడింది. రామ్ రెడ్ సినిమాలో ఇస్మార్ట్ మాస్ ఆడియెన్స్ కు ట్రీట్ కొనసాగించేలా ఉన్నాడు. రామ్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఫ్లేవర్ తోనే రెడ్ కూడా వస్తుంది.

చూస్తుంటే రామ్ రెడ్ సినిమా ఆ సినిమా ఫలితాన్ని రిపీట్ చేసేలా ఉంది. 2021 సంక్రాంతికి వస్తున్న రామ్ రెడ్ మూవీకి పోటీగా రవితేజ క్రాక్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్, అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమాలు వస్తున్నాయి. మరి ఈ సినిమాల మధ్యలో రామ్ రెడ్ ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.                



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: