చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?
అయితే అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ తప్పుకున్నాడు. దీంతో ఈ స్క్రిప్ట్ బాధ్యతలు డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతిలోపెట్టారు. అయన కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. చివరికి ఈ ప్రాజెక్ట్ తమిళ డైరెక్టర్ మోహన్ రాజా చేతికి వెళ్ళింది. ఇటీవలే ఈ సినిమా కి మోహన్ రాజా ని డైరెక్టర్ గా ఫైనల్ చేశారు చిరు.. మొన్నటి దాకా వేదలమ్ రీమేక్ తర్వాత ఈ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మోహన్ రాజా ఎంట్రీ తో లూసిఫర్ తర్వాతే వేదలమ్ రీమేక్ తెరకెక్కనుంది..
ఒరిజినల్‌తో పోలిస్తే ఇంకొంచెం వినోదాత్మకంగా, కమర్షియల్ అంశాల కలబోతతో సినిమా ఉండాలని చిరు కోరుకున్నారు. రాజా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. చిరు సినిమా అన్నాక కథానాయిక లేకుంటే చాలా కష్టం. లూసిఫర్‌లో మోహన్ లాల్‌కు జోడీ ఉండదు. తెలుగులో ఆ పాత్రను అలాగే చూపిస్తే సరిపోదని.. హీరోయిన్, రెండు మూడు పాటలు లేకుండా తన అభిమానులు ఒప్పుకోరని చిరు బలమైన అభిప్రాయంతో ఉన్నారట. రాజా ఆ మేరకు కొత్త ఎపిసోడ్ జోడించి హీరోయిన్ పాత్రకు స్కోప్ ఇచ్చారట. ఈ పాత్ర కోసం సరైన హీరోయిన్ని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ఇలియానా పేరు కూడా వినిపిస్తుండటం విశేషం.