అన్న గారిని దించేసిన హైపర్ ఆది.. ఆ మాత్రం ఉండాలి మరి..?

praveen
జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా హైపర్ ఆది ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాదా సీదా   కంటెస్టెంట్ గా జబర్దస్త్ ప్రోగ్రాం కి ఎంట్రీ ఇచ్చినా ఆది ఆ తర్వాత తన దైన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులందరికీ ఆకర్షించి ఇక ఆ తర్వాత ఏకంగా టీం లీడర్ గా హోదాను సంపాదించాడు. టీమ్ లీడర్గా మారినప్పటి నుంచి ఎంతో అద్భుతంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించి  కడుపుబ్బ నవ్విస్తూ వస్తున్నాడు హైపర్ ఆది. ప్రతి వారం కూడా సరికొత్త స్కిట్ తో తెర మీదికి వచ్చే హైపర్ ఆది పంచులు వర్షం తోప్రేక్షకులను మెప్పిస్తున్నాడు అనే విషయం తెలిసిందే.


 అయితే ఈ మధ్య కాలంలో హైపర్ ఆది కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర అన్ని  ఈవెంట్  కూడా తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొడుతు బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ  లో మొన్నటి వరకు వర్షిణి తో కలిసి ఒక వైపు టీం లీడర్ గా కొనసాగాడు హైపర్ ఆది కి ఇప్పుడు డీ13 లో సుడిగాలి సుధీర్ హైపర్ ఆది కలిసి టీం లీడర్ గా చేస్తున్నాను. అయితే ఢీ షోలో వర్షిని తో  కలిసి జంటగా హైపర్ ఆది టీం లీడర్ గా కొనసాగే సమయంలో ఈ  జంటకీ ఎంతగానో క్రేజ్ వచ్చింది.



 ఈ క్రమంలోనే ఈ జంట ఈటీవీ లో ప్రసారమయ్యే పలు ఈవెంట్ లలో  కూడా కలిసి డాన్స్ పెర్ఫార్మన్స్ లు చేసి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక ఇటీవల న్యూఇయర్ సందర్భంగా ఈ టీవీ యాజమాన్యం ప్లాన్ చేసిన సరికొత్త ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో  విడుదలై  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక  సీనియర్ ఎన్టీఆర్ సాంగ్ ఆకు చాటు పిందె తడిసే అనే పాట పై హైపర్ ఆది డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆది తో కలిసి అటు జూనియర్ శ్రీదేవి లాగా  గెటప్ వేసిన వర్షిని కూడా తన డాన్స్ తో అదరగొట్టింది. ఇక హైపర్ ఆది అచ్చం  అన్న గారి లాగా ఓల్డ్ గెటప్ వేసి సాంగ్ లో అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: