దిల్ రాజు బర్త్ డే లో ఆ ఇద్దరు మిస్.. ఎందుకు..?
హీరోయిన్స్ పూజా హెగ్దే, నివేదా పేతురాజ్ లతో పాటుగా నాగ చైతన్య, సమంతలు జంటగా వచ్చారు. మహేష్ తో పాటు నమ్రత కూడా దిల్ రాజు బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. అయితే ఈ పార్టీకి ఇద్దరు స్టార్స్ మాత్రం డుమ్మా కొట్టారు. అదెవరు అంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఇద్దరు స్టార్స్ దిల్ రాజు బర్త్ డే బాష్ లో పాల్గొనలేదు. ఇద్దరితో దిల్ రాజు సినిమాలు చేశాడు సూపర్ హిట్లు కూడా కొట్టాడు.
ఇక్కడే షూటింగ్ జరుపుకుంటున్న యశ్ తో సహా అందరు ఈ ఈవెంట్ లో పాల్గొనగా అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ ఎందుకు రాలేదా అన్నట్టుగా రకరకాల వార్తలు రాస్తున్నారు. మరి ఈ ఇద్దరు వేరే ఏదైనా పనుల్లో ఉండి రాలేదా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. మరి అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ రాకపోవడానికి కారణాలు ఏంటో కాని నందమూరి ఫ్యామిలీ నుండి ఒక్క హీరో కూడా రాకపోవడంతో దిల్ రాజుకి వారికి మధ్య దూరం పెరిగిందా అన్న విధంగా కామెంట్స్ వస్తున్నాయి.