పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ టీజర్ వచ్చేస్తోంది..!!
దీంతో సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అవలేదు. నిజానికి పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా గత సెప్టెంబర్ 2నే దీన్ని వదులుతారని అనుకున్నా.. అలా జరగలేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ సినిమా టీజర్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'వకీల్ సాబ్' టీజర్‌ను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన కట్ కూడా అయిపోయిందని అంటున్నారు. అలాగే, థమన్ కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసి ఇచ్చేశాడట.
దీంతో ఈ సారి టీజర్ రావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.ఇక షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు..ఇక ఈ సినిమా తర్వాత మలయాళ హిట్ మూవీ అయ్యప్పనున్ కోషియం రీమేక్ లో నటించనున్నాడు పవన్. సాగర్. కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నాడు...ఇక పవన్ తో పాటు మరో పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి..కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది...!!