బిగ్ బాస్ పై పునర్నవి షాకింగ్ కామెంట్స్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్ బాస్ షో కి ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ షో కి ప్రేక్షకులు బాగానే బ్రహ్మరధం పడతారు. తమకు ఇష్టమైన హౌస్ మేట్ ని బాగా ట్రెండ్ చేస్తూ ఒక స్టార్ హీరో కి చేసినంత హడావిడి చేస్తారు.. కాని ఆ తరువాత ఆ హడావిడి అంతగా ఏముండదు. తాజాగా బిగ్ బాస్ షో పై ప్రముఖ నటి బిగ్ బాస్ 3 కంటెన్స్టెంట్ పునర్నవి భూపాళం షాకింగ్ కామెంట్స్ చేసింది.17 ఏళ్ల వయసులోనే ‘ఉయ్యాలా జంపాలా’తో కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన పునర్నవి… ఆ తర్వాత కొన్నాళ్లు అంతగా సినిమాల్లో కనిపించలేదు. కారణం ఆ టైమ్‌లో ఆమె ఎడ్యుకేషన్‌పై దృష్టిసారించడమే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే బిగ్‌బాస్‌కు ముందు తన కెరీర్‌ విషయంలో ఆమె చాలా సంతోషంగానే ఉందట.
అయితే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు రావడం లేదనే పోలికలు చూసుకోవడం కంటే కెరీర్‌ను బిల్డ్‌ చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలనేదే తన ఆలోచనగా చెప్పింది. అంతేకాదు డ్యాన్స్‌ థెరపీలో మాస్టర్స్‌ చేయడం తన గోల్‌ అని కూడా చెప్పింది.బిగ్‌బాస్‌ వల్ల తనకు ప్రత్యేకంగా ఒరిగిందేం లేదు అని అంటోంది.‘‘బిగ్‌బాస్‌ వల్ల నా యాక్టింగ్‌ కెరీర్‌కి ఎలాంటి హెల్ప్‌ జరగలేదు. సోషల్‌ ప్రొఫైల్ పెంచుకోవడంలో ఎలాంటి ఉపయోగం జరగలేదు. అయితే చాలామంది అభిమానులకు నేను చేరువయ్యాను’’అని చెప్పింది పునర్నవి.
అయితే తాజా సీజన్‌లో ఇప్పటికే బయటకు వచ్చేసిన హౌస్‌మేట్స్‌ అంటే సినిమా నేపథ్యం ఉన్నవారు దివి, మోనాల్‌కి వరుస అవకాశాలు వస్తుండటం విశేషం. మరోవైపు పునర్నవి టమడా మీడియా రూపొందిస్తున్న ‘కమిట్‌మెంటల్‌’ వెబ్ సిరీస్‌లో చేస్తోంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: