మరోసారి బాలయ్యతో జతకడుతున్న లేడీ సూపర్ స్టార్..!!

Anilkumar
బాలకృష్ణ 106వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది.8ఇక ఇటివలే ఈ చిత్ర షూటింగ్ మొదలై శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.  ప్రస్తుతం బోయపాటి  చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు ఓకే చేసారు మన బాలయ్య. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ.. 'బలరామయ్య బరిలో దిగితే..' అనే టైటిల్ తో రూపొందే చిత్రానికి సైతం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.  డైరక్టర్  సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.ఇక బాలయ్య - సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో ఈ కథని తెరపైకి తీసుకెళ్లేందుకు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సన్నాహాలు చేస్తోంది.సంతోష్ శ్రీన్‌వాస్‌ ఇప్పటికే కందిరీగ, హైపర్ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు.

 ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'అల్లుడు అదుర్స్' అనే సినిమాను తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు ఈ మధ్యే బాలయ్యకు ఓ కథను వినిపిస్తే అది ఆయనకు బాగా నచ్చిందని.. వెంటనే ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్న మన బలయ్యే..ఆ తర్వాత  తన 107వ చిత్రాన్ని 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్‌తో చేయనున్నారట.ఇక ఈ సినిమాలో బాలయ్య పక్కన ఇద్దరు కథానాయికలుంటారని, అంతేకాకుండా సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతారను ఒక హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది.గతంలో బాలయ్య, నయన్ కాంబోలో 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'జైసింహా' సినిమాలు వచ్చాయి.

ఇందులో సింహా, శ్రీ రామ రాజ్యం చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక కే. ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన జై సింహా యావరేజ్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ బాలయ్య తో నటించనుంది నయనతార.ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి..ప్రస్తుతం BB3 షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత షెడ్యూల్ నంద్యాలలో ఫిక్స్ చేసారని..అక్కడ ఓ భారీ సెట్ వేసి బాలయ్య పై ఒక హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నాడట దర్శకుడు బోయపాటి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: