షాక్ ఇస్తున్న కార్తీ లుక్.. ఇది ఒరిజినల్ అంటూ కామెంట్స్..!

shami
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కొత్త లుక్ ఆడియెన్స్ కు షాక్ ఇస్తుంది. సూర్య సోదరుడు కార్తీ తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. సూర్య లానే తెలుగులో కూడా కార్తి సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. కార్తి రీసెంట్ మూవీ దొంగ కూడా తెలుగులో రిలీజైంది. ప్రస్తుతం సుల్తాన్ సినిమాలో నటిస్తున్నాడు కార్తి. ఈ సినిమాలో కార్తీ సరసన కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
సూర్య నిర్మిస్తున్న కొత్త సినిమా ఓపెనింగ్ సందర్భంగా కార్తీ వెరైటీ లుక్ తో దర్శనమిచ్చాడు. చెప్పాలంటే ఓ యాభై ఏళ్ల వయసు గల వ్యక్తిగా కార్తీ లుక్ ఉందని చెప్పొచ్చు. ఏదైనా సినిమా కోసమే కార్తీ ఈ లుక్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కార్తీ ఈ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లుక్ చూసిన యాంటీ ఫ్యాన్స్ అతని ఒరిజినల్ లుక్ అదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగులో స్ట్రైట్ సినిమా ప్లాన్ చేస్తున్న కార్తీ సరైన సబ్జెక్ట్ దొరకట్లేదని తెలుస్తుంది. తప్పకుండా అలాంటి కథ దొరికితే మాత్రం కార్తీ తెలుగు డైరెక్ట్ సినిమా చూడొచ్చన్నమాట. తెలుగు దర్శకులందరు కార్తీతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కార్తీ మాత్రం ఇక్కడ చేయాలంటే మంచి కథ దొరకాలని అంటున్నాడట. మరి కార్తీని మెప్పించే తెలుగు కథ ఎప్పుడు వస్తుందో చూడాలి. కార్తీ తెలుగు స్ట్రైట్ సినిమా చేస్తే మాత్రం ఇక్కడ అతని ఫ్యాన్స్ కు పండుగ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: