ఆర్ఎక్స్ 100 భామ ఐటెం సాంగ్ కు రెడీ...!

VAMSI
తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన కెరియర్ కు తొలి అడుగులు పడిన చిత్రం   ‘ఆర్ఎక్స్ 100’ ఈ సినిమా తోనే అటు ఇండస్ట్రీని, ఇటు ప్రేక్షకులను ఆకట్టుకుంది పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో ఆమె అందాల ఆరబోతతో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రెచ్చిపోయి నటించిన విషయం తెలిసిందేే. అందమైన హీరోయిన్ గానే కాక అబ్బురపరిచే నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 తర్వాత కూడా కెరియర్ పరంగా మంచి అవకాశాలే దక్కాయి.

ఈ విషయంలో పాయల్ తనకు అంత మంచి అవకాశం ఇచ్చిన ఆర్ఎక్స్ 100 దర్శకుడికి రుణపడి ఉంటుంది. అంతగా ఆర్ఎక్స్ 100 చిత్రం ఆమె కెరియర్ కు పునాది వేసి సూపర్ హిట్  ను అందించింది.
గ్లామర్ పాత్రలకే పరిమితమై పోవాలని అనుకోకుండా పాత్రకు ప్రాధాన్యం ఇచ్చే రోల్స్ ను కూడా చేసి ప్రేక్షకుల మెప్పు పొందింది పాయల్. రవితేజ ‘డిస్కో రాజా’తో మాటలు రాని అమ్మాయిగా  అభినయంతో తన టాలెంట్ నిరూపించుకుంది. ఇటీవల ‘ఆహా’ యాప్ ద్వారా విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’ సినిమాలో డీగ్లామరస్ పాత్రలో మెరిసి తన నటన లో మరో కోణాన్ని చూపి ఆకర్షించింది.

అయితే ఇప్పుడు ఈమెకు సంబంధించిన మరో తాజా వార్త కుర్రకారుకు జోరు పెంచుతోంది. త్వరలో ఈమె మరోసారి ఐటమ్ సాంగ్లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ ఆ ఆఫర్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ నుండి రావడం.. మరింత ఆసక్తికరంగా మారింది. ఆర్ ఎక్స్ 100 సినిమా తో తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు రుణం తీసుకునే టైం వచ్చేసింది అంటున్నారు అభిమానులు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఎట్టకేలకు దర్శకుడు అజయ్ భూపతి 'మహాసముద్రం' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్ మరియు సిద్దార్థలు కలిసి నటిస్తుండగా... ఇందులో ఐటమ్ సాంగ్ చేయడానికి దర్శకుడు అజయ్ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు పాయల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఎంత నిజం ఉన్నది తెలియాలంటే మరికొంత సమయం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: