నాలుగు సెట్లు.. ఒక్క సీన్.. క్లైమాక్స్ అదిరింది పోతుందా..?

praveen
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రభాస్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు కేవలం టాలీవుడ్ అభిమానులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఎదురు చూసేంతగా  ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది అయితే బాహుబలి సినిమా తర్వాత సాహో అనే యాక్షన్  ఫిక్షన్ మూవీలో నటించిన ప్రభాస్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.


 ఇక ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్  అనే సినిమా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతుంది అనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.  ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకి వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


 పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా పలు భాషల్లో విడుదల కాబోతున్న ట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అయితే ఒకే సమయంలో ఏకంగా నాలుగు సెట్లలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఇక ఒక్క క్లైమాక్స్ కోసం నాలుగు సెట్లు వేయడంతో ఇక రాధేశ్యాం సినిమాలో క్లైమాక్స్ ఊహకందని విధంగా ఉండబోతుంది అని ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఇక రాధేశ్యామ్  సినిమాలో ప్రభాస్ లుక్  కూడా ఎంతో డిఫరెంట్ గా ఉండడం... డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతూ  ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: