నీహారిక పెళ్లిలో ఇంట్రెస్టింగ్ న్యూస్..!

NAGARJUNA NAKKA
మెగా నట వారసురాలు నిహారిక పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.  పెళ్లికి ఎవరెవరు వస్త్తారని కొందరు ఎదురుచూడగా.. మరికొందరి చూపు మాత్రం.. మెగా.. అల్లు జంటలు ఏయే డిజైనర్‌వేర్‌తో వచ్చారు?  ఎవరు ఎంత కాస్ట్‌లీ వేర్‌తో ఆకట్టుకున్నారని చూశారు. వాళ్లు ధరించిన కాస్ట్యూమ్స్‌కు ధర కూడా నిర్ణయించేశారు. మరి  పెళ్లిలో ఎవరు ఎక్కువ కాస్ట్యూమ్స్ మార్చారు? ఎవరు కాస్టీ వేర్‌తో మెరిశారో లెక్కలు తీశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

పసుపు కొట్టడంతో నిహారిక పెళ్లి తంతు మొదలైంది. ఉదయ్‌పూర్‌లో జరిగిన పెళ్లికి అల్లు, మెగా ఫ్యామిలీస్‌ స్పెషల్‌ ఫ్లైట్స్‌లో వెళ్లడం.. అక్కడ సంగీత్‌, మెహందీ.. హల్దీ అంటూ ఈ డెస్టినేషన్ మ్యారేజ్‌ ఘనంగా జరిగింది. చిరంజీవి... నాగబాబు దంపతులను పక్కన పెడితే.. హడావుడి అంతా యంగ్‌ కపుల్స్‌దే.  రామ్‌చరణ్‌-ఉపాసన.. బన్నీ-స్నేహారెడ్డి .. చిరంజీవి కూతుళ్లు ధరించిన డిజైనరీ దుస్తులు.. బ్యాగ్‌లు.. జ్యువెల్‌  ఫ్యాషన్‌ ప్రియుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఎవరి బట్టలు ఎవరు డిజైన్‌ చేశారు.. బ్యాగ్‌లు ఏం కంపెనీవి.. వాటి రేటెంతో పోస్ట్‌ చేశారు. వీటిని నెటిజన్లు కట్టిన వెల షాక్‌ ఇచ్చేలా ఉన్నాయి.

బన్నీ దంపతులు నీహారిక పెళ్లికి బయలుదేరడం మొదలు.. తిరిగి వచ్చేవరకు.. నెట్‌లో ఫొటోలు పోస్ట్‌  చేస్తూనే వున్నారు. ప్రతి ఈవెంట్‌లోనూ డ్రస్‌ సెన్స్‌ తో అందరి దృష్టి తమవైపు తిప్పుకున్నారు. ఉదయ్‌పూర్‌ వెళ్లేటప్పుడు స్నేహారెడ్డి ధరించిన బూడిద రంగు వెస్ట్రన్‌ లాంగ్‌ ఫ్రాంక్‌ బన్నీకి బాగా నచ్చింది. సో  క్యూటీ అంటూ కామెంట్ చేశారు. అనితా దొంగ్రే డిజైన్‌ చేసిన ఈ ఫ్రాక్‌ దర 13 వేలే అయినా.. అదే సమయంలో చేతిలో వున్న  దియోర్‌ శాడల్‌ కంపెనీ బ్యాగ్‌ ధర రెండున్నర లక్షలుంటుందని అంచనా.

పెళ్లికెళితే.. ఆడవాళ్ళ చూపులన్నీ.. నగలు బట్టలపైనే వుంటాయి. అందులోనూ మెగా ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి. స్టార్స్‌ కపుల్‌ ఎలా కనిపిస్తారన్న ఆసక్తిని  రెట్టింపు చేశారు. ఉదయ్‌పూర్‌ వెళ్లేటప్పుడు ఉపాసన  లైట్‌ పింక్‌ కలర్‌ ఫ్రాక్‌లో మెరిసింది. ఆమె చేతిలో వున్న బ్యాగ్‌ ఖరీదు చూస్తే.. కళ్లు తిరగడం ఖాయం. హెర్మస్‌ బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాగ్‌ ఖరీదు దాదాపు 12 లక్షలని నెటిజన్లు ఎస్టిమేషన్‌ వేశారు. ఇక సంగీత్‌లో.. పెళ్లిలో తరుణ్‌ తహిలియానీ.. మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన దుస్తులు లక్షల్లో ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: