దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా తో అయినా ఫామ్ లోకి వచ్చేనా..?
అయితే దేవిశ్రీ సినిమాలు చేయడం లేదా అంటే చేస్తున్నాడు.. అయితే తమన్ ఇచ్చినంత సంగీతం మాత్రం ఇవ్వడం లేదట.. వీరిద్దరి మధ్య పోటీ ఏమో గానీ ఇద్దరినీ మెచ్చే దర్శకులు ఎవరిని తీసుకోవాలా అని అయోమయంలో పడ్డారట.. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలన్నీ థమన్ చేతిలో ఉన్నాయి.. దేవిశ్రీ చేతిలో తమన్ కి ఉన్న సినిమాలైతే లేవు.. ఈ నేపథ్యంలో రవితేజ తో ఖిలాడీ అనే సినిమా కి దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోని దేవిశ్రీప్రసాద్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. రవితేజ మార్కు చిత్రాలకు కొంచెం భిన్నంగా ఈ మూవీని దర్శకుడు రమేష్‌వర్మ ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో విలన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. శృతిహాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మూవీ చివరి సాంగ్ షూట్ ఇటీవల గోవాలో పూర్తయింది. గత కొన్ని రోజులుగా హిట్ లేని రవితేజ కి ఈ సినిమా మోస్ట్ వాంటెడ్ హిట్ గా మారిపోగా ఈ మూవీ పూర్తవడంతో రవితేజ తన తదుపరి చిత్రం `ఖిలాడీ`సెట్లోకి వెళ్లిపోయారు.