నిహారిక పెళ్ళిలో అకిరా నందన్ తో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక హడావిడి !

Seetha Sailaja
పవన్ ఏవిషయాన్ని చాల సీరియస్ గా తీసుకోడు అని అంటారు. అందువల్ల పవన్ వేసే ఎత్తుగడలలో ఏమాత్రం ప్లానింగ్ గా ఉండదు అని కూడ అంటూ ఉంటారు. అయితే పవన్ ఏమి చేసినా ఎవరు ఊహించని విధంగా చేస్తూ అందరి మైండ్ ను బ్లాంక్ చేస్తూ ఉంటాడు. పవన్ ఏమి చేసినా చివరి నిమిషం వరకు అలా ఎవరికీ ఏమీ చెప్పకుండా హడావుడి చేయడం అతడిఅలవాటు.  


గతంలో చిరంజీవి షష్టి పూర్తి జరిగినప్పుడు ఆ వేడుకలకు  పవన్ చివరి నిముషం వరకు వస్తాడా రాడా   అన్న సస్పెన్స్ కొనసాగించాడు. ఇప్పుడు కూడ నిన్న ఉదయపూర్ లో జరిగిన నిహారిక పెళ్ళికి పవన్ వస్తాడా రాడా అన్న సస్పెన్స్ కు బ్రేక్ ఇస్తూ నిన్న ఉదయం పవన్ ప్రత్యేక విమానంలో తన కొడుకు  అకిరా తో కలిసి నిహారిక పెళ్ళికి వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు ఈ ఊహించని ట్విస్ట్ కు మెగా ఫ్యామిలీ కూడ షాక్ అయినట్లు టాక్.


అంతేకాదు పెళ్ళిలో అకిరా నందన్ మెగా ఫ్యామిలీ హీరోలు అందరితో చాల కలివిడిగా కలిసిపోతూ ప్రవర్తించిన తీరుకు చిరంజీవి కూడ చాల ఆనంద పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అకిరా  నందన్ వయస్సు 16 మాత్రమే. కానీ అకిరాను చూస్తే ఎక్కడ 16 ఏళ్ల టీనేజర్ లా కనిపించడు. ఇప్పటికే అకిరా ఎత్తు 6.4 ఉండటంతో అకిరా ప్రభాస్ రానా ల కంటే ఎత్తుగా కనిపిస్తున్నాడు.


దీనికితోడు అకిరా నందన్ త్వరలో అడవి శేషు హీరోగా నటిస్తున్న మేజర్ ఉన్ని క్రష్ణన్ బయోపిక్ ‘మేజర్’ లో ఒకప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈవార్తలు విన్న పవన్ అభిమానులు ఇప్పటికే జోష్ లోకి వెళ్ళిపోతున్నారు. దీనికితోడు నిహారిక పెళ్ళిలో అకిరా హైట్ కు సంబంధించిన ఫోటోలను చూసిన పవన్ అభిమానులు అకిరా బాలీవుడ్ హీరో గెటప్ లో ఉన్నాడు అంటూ వరస పెట్టి కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: