
సంక్రాంతి పండక్కి.. బ్యాంకాక్ వెళ్ళబోతున్న రౌడీ హీరో..?
ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగానే పూరి జగన్నాథ్ సినిమాలు అంటే మాస్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. దానికితోడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ తోడైతే ఇక ఏ రేంజ్లో సినిమా ఉండబోతోందో అని ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచుకొంటున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా కూడా తెరకెక్కుతుండడతో ఈ సినిమాపై అంచనాలు మరింత పిక్స్ రేంజ్ లోకి వెళ్ళి పోతున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయింది.
ఇంకా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాలేదు అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. త్వరలో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్ ప్రారంభించబోతున్నారని సమాచారం. అయితే సంక్రాంతి నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ బ్యాంకాక్ కు వెళ్లి పోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని కీలకమైన ఫైట్ సీన్లను బ్యాంకాక్లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ఒక పెద్ద డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటించనుండగా ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే నటిస్తోంది.