సంక్రాంతి బరిలో అక్కినేని బ్రదర్స్ డౌటేనా..!?
ఈ ఏడాది క్రిస్మస్‌కి సోలో బ్రతుకే సో బెటర్, కపటధారి చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే అందరి దృష్టి వచ్చే ఏడాది సంక్రాంతి మీదనే ఉంది. సంక్రాంతి బరిలో భారీ బడ్జెట్ చిత్రాలైతే రావడం లేదు కానీ.. రవితేజ.. క్రాక్, నాగచైతన్య.. లవ్‌స్టోరి, అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బెల్లంకొండ శ్రీనివాస్.. అల్లుడు అదుర్స్ ఉంటాయని వార్తలు వినిపించాయి. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు నాగచైతన్య.. లవ్‌స్టోరి, అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు విడుదల కాకపోవచ్చునని అంటున్నారు. ఈ సినిమాలను సమ్మర్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి సందడి చేద్దామనుకున్న అక్కినేని అభిమానులకు నిరాశ కలిగినట్టేనని అందరూ అనుకుంటున్నారు.
అయితే లవ్‌స్టోరి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక మజిలీ సక్సెస్ తర్వాత నాగచైతన్య చేస్తున్న సినిమా లవ్‌స్టోరి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా, సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. ఇందులో చైతన్య తెలంగాణ కుర్రాడిగా కనపడతాడని అంటున్నారు. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న చిత్రమిది. ఈ సినిమా సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని నాగచైతన్య అనుకుంటుండగా, మరోవైపు అఖిల్, హలో, మజ్ను చిత్రాలను ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అఖిల్ అక్కినేని ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌పైనే తన ఆశలను పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. ఈ సినిమా సక్సెస్ అయితే, భాస్కర్‌కు కూడా బ్రేక్ దొరికినట్టేనని చెప్పొచ్చు.