పవన్ డైటింగ్ పై షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్  ఏది చేసినా అది సంచలనమే గత కొంత కాలంగా  ఫిజికల్‍ ఫిట్‍నెస్‍ పై పూర్తిగా పవన్ శ్రద్ధ తగ్గించివేసాడు. లాక్‍ డౌన్‍ టైమ్ లో హీరోలు అందరు తమ లుక్ ను పెంచుకోవడానికి శ్రద్ధ పెడితే పవన్ తన చాతుర్మాస దీక్షను కొనసాగించాడు. ‘వకీల్‍ సాబ్‍’ షూటింగ్ కోసం తన దీక్షను విరమించి తన కొత్త లుక్ లో ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించాడు.

అయితే పవన్ లుక్ పై అనేక విమర్శలు రావడంతో ఈ విషయాలు అతడి దృష్టి వరకు వెళ్ళడంతో పవన్ తన లుక్ ను మార్చుకోవడానికి ప్రస్తుతం లిక్వీడ్ డైట్ పై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా పవన్ లిక్వీడ్ డైట్ ను ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘వకీల్ సాబ్’ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు.

ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ తన ఏజ్‍ తగ్గి కనిపించవలసిన అవసరం ఉంది. ఈ ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ లోనే పవన్ శృతి హసన్ ల లవ్ ట్రాక్ సీన్స్ ఉన్నాయి అని అంటున్నారు. దీనికోసం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లిక్విడ్‍ డైట్‍ మీద ఉన్నట్లు తెలుస్తోంది.  గతంలో ‘జానీ’ చిత్రంలో లీన్‍ లుక్‍ కోసం పవన్‍ ఏడాదిన్నర పాటు కేవలం పానీయాలు మాత్రమే తీసుకున్న విషయం తెలిసిందే.

నిహారిక పెళ్లితో పాటు ఇతర రాజకీయ పరమైన మీటింగులన్నీ ముగించుకుని సరికొత్త రూపంలో తయారై ‘వకీల్‍ సాబ్‍’ షూటింగ్‍ ను ఫినిష్‍ చేస్తాడట. ఆ తర్వాత అదే లుక్‍ తో  ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ చిత్రానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్‍ వర్క్ ముందుగా మొదలు పెట్టి ఆతర్వాత మిగతా సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తరువాత పవన్ తన తదుపరి సినిమాల షూటింగ్ పై దృష్టి పెడతాడు అని తెలుస్తోంది. ‘వకీల్ సాబ్’ కోసం పవన్ 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు కాబట్టి ఆమాత్రం అయినా కష్టపడకుంటే తన పాత్రకు న్యాయం చేసినట్లు అవదని పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనుకోవాలి..      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: