'ఆదిపురుష్' లో ప్రభాస్ సరసన సీతగా నటించనున్న మహేష్ హీరోయిన్..!!

Anilkumar
టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.ప్రెజెంట్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో 'రాధే శ్యామ్' సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.1920 లో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ప్రేక్షకులల్లో మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. అందులో ఒకటి 'ఆదిపురుష్'.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.  భారతీయ పురాణం, ఇతిహాసమైన రామాయణం ఆధారంగా ఈ సినిమాని తీయనున్నారు.ఇందులో ప్రభాస్ రాముని పాత్రలో కనిపించి అభిమానులను అలరించనున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఇందులో రావణ్ పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పోషిస్తుననాడు. రాముడు ఓకే, రావణుడు సరే ఇంతకీ లక్షణుడు ఎవరని అనుమానాలు వచ్చాయి. అయితే ఈ పాత్ర బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ చేయనున్నాడని వార్తలు వినిపించాయి. ఓకే మరి సీతగా ఎవరు కనిపిస్తారని అభిమాను ప్రశ్నించారు.పాత్రకు ఇప్పటికే కొందరు హారోయిన్ల పేర్లు చర్చలో ఉన్నాయి.
 అందరిని పరిశాలించిన ఓం రౌత్ కృతి సనన్‌ను ఎంపిక చేశారని కథనాలోచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు కృతి సనన్ సూపరిచితురాలే. గతంలో తెలుగులో మహేష్ సినిమా 1నేనొక్కడినే, నాగచైతన్య దోచేయ్ చిత్రాల్లో చేసింది. ఇప్పుడు ప్రభాస్ సరసన చేసేందుకు ఆఫర్ దక్కించుకుంటుందరన్న వార్త అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆదిపురుష్ చిత్ర బృందం ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమన్నా వస్తుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: