నిహారిక పెళ్ళి కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో తెలుసా..??

Anilkumar
ఈ కరోనా కష్ట కాలంలో కూడా పెళ్ళిళ్ళు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో యువ నటీ, నటులు ఇప్పటికే పెళ్లి పీటలు ఎక్కేసారు. యువ హీరోలు నిఖిల్, నితిన్, రానా దగ్గుబాటి,లతో పాటు మరికొందరు తమ బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి చెప్పేసారు. ఇక మొన్నటికి మొన్న మన టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఘనంగా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు త్వరలోనే మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మొగనున్నాయి. మెగా డాటర్, నాగబాబు కూతురు నిహారిక పెళ్లి డిసెంబర్ లో ఫిక్సయిన విషయం తెలిసిందే. తాజాగా నిహారికా, చైతన్యల వివాహానికి ఏర్పట్లన్నీ దాదాపుగా కంప్లీట్ కఅయ్యాయని తెలుస్తోంది. కరోనాను ధృష్టిలో ఉంచుకుని అతి తక్కువ బంధువులకు, అథితులకు ఆహ్వానం పంపుతున్నట్టు సమాచారం.

 అయితే ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నట్టు తెలుస్తోంది.కాగా మెగా ఫ్యామిలీ మెంబర్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే నిహారికా, చైతన్యల ఎంగేజ్ మెంట్ కు కూడా పవన్ కళ్యాణ్ రాలేకపోయారు. కాగా పెళ్లికి కూడా హాజరవుతారో లేదోనని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే వకీల్ సాబ్ మూవీ షూటింగ్ లో ఈయన బిజీగా ఉన్నారు కాబట్టి ఇలా అనుకుంటున్నారు. అయితే ఈ విషయం పుకార్లు షికార్లు కొడుతున్నాయి.అయితే అల్లరి పిల్ల నిహారికా మాత్రం పెద్దనాన్న, చిన్ననాన్న అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ దగ్గర హామీ తీసుకుందట..  నా పెళ్లికి ఖచ్చితంగా రావాల్సిందేనని మాట తీసుకుని ప్రత్యేకంగా వారిని ఇన్వైట్ చేసేసిందట.

 ఇంకేముంది వారిరువురూ నిహారికా బ్యూటీ పెళ్లికి తప్పకుండా హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే సినీ వర్గాల నుంచి తెలుసుకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం షూటింగ్ నడుస్తున్న వకీల్ సాబ్ సినిమాకు డిసెంబర్ లో వారం రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఎందుకుంటే నిహారికా పెళ్లి కారణంగానే వారం రోజుల పాటు షూటింగ్ కు దూరంగా ఉండబోతున్నట్టు సమాచారం. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు ఫ్యామిలీతో వెళ్లి సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాకతో.. నిహారిక పెళ్లి అంగ రంగ వైభవంగా జరగనుందన్నమాట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: