పవన్ కళ్యాణ్ ఎంపిక పై ఆధారపడిన ఆముగ్గురు !
ఇక ఈ సినిమాకు సంబంధించి పవన్ పాత్రతో సరిసమానంగా ప్రాధాన్యత ఉన్న కోషి పాత్ర కోసం రకరకాల ఆలోచనలు చేసిన తరువాత ఈ పాత్ర కోసం ఫైనల్ గా ముగ్గురులో ఒకరిని ఎంచుకోవాలని భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికే కోషీ పాత్ర కోసం రానా తో రాయబారాలు చేస్తున్న ఈ మూవీ దర్శక నిర్మాతలు హీరో గోపీ చంద్ కన్నడ హీరో సుదీప్ లను కూడ ఈ పాత్ర గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈ మూవీ మళయాళ మాతృకలో ఉన్నట్లుగా కాకుండా తెలుగు వెర్షన్ వచ్చే సరికి పవన్ పాత్రను బాగా పెంచి కోషీ పాత్రను కొంతవరకు తగ్గించినట్లు లీకులు వస్తున్నాయి. దీనితో రానా ఈ మూవీలో నటించడానికి ఆశక్తి కనపరచకపోతే గోపీ చంద్ తో కానీ లేదంటే సుదీప్ తో కానీ ఈ కోషీ పాత్ర నటింప చేయాలని ఈ మూవీ మేకర్స్ ఆలోచన అని అంటున్నారు.
అయితే రానా లేకుంటే సుదీప్ ఎంపిక వైపు మొగ్గుచూపుతున్నారు అన్న లీకులు వస్తున్నాయి. దీనికి కారణం సుదీప్ కు తెలుగు ప్రేక్షకులలో స్టైలిష్ విలన్ గా మంచి ఇమేజ్ ఉంది కాబట్టి చివరకు సుదీప్ ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ అవ్వడం ఖాయం అని అంటున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా పవన్ ఎంపిక పై ఆధారపడి ఉంటుందని పవన్ ఎవరిని కోరుకుంటే వారిని ఎంపిక చేద్దాము అన్న ఆలోచనలో ఈ మూవీ దర్శక నిర్మాతలు ఉన్నట్లు టాక్..