మరోసారి ఎన్టీఆర్ తో నివేదా థామస్ ... మ్యాటర్ ఏంటంటే ..... ??
తొలిసారిగా మరొక నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తరువాత ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అదిరిపోతుందని మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా ఒక స్టార్ నటి ఎంపికైనట్లు చెబుతున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో మరొక హీరోయిన్ పాత్ర కూడా ఉందని కాగా ఆ పాత్రకు గాను రెండు రోజుల క్రితం యువ నటి నివేదాథామస్ ని ఎంపిక చేశారట దర్శకుడు త్రివిక్రమ్. కథాపరంగా ఆమె పాత్రకు మంచి గుర్తింపు ఉంటుందని అటువంటి పాత్రకి నివేదా మాత్రమే న్యాయం చేయగలదని భావించిన త్రివిక్రమ్ ఫైనల్ గా ఆమెకు ఓటు వేసినట్లు చెబుతున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం జై లవకుశ తర్వాత మరొక సారి ఎన్టీఆర్, నివేద ల జోడిని వెండితెరపై చూడవచ్చు....!!