షురూ చేసిన చిరూ.. ఇక గ్యాప్ లేకుండా కుమ్మేస్తాడట..!!

Anilkumar
చిత్ర పరిశ్రమలో ఇటివలే మళ్ళీ సినిమా షూటింగ్లు మొదలైన సంగతి తెలిసిందే కదా.. అయితే ఒకవైపు యువ హీరోలందరూ తమ తమ షూటింగుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంటే..సీనియర్ హీరోలు మాత్రం కరోనా భయంతో షూటింగ్స్ కి వెళ్లలేకపోతున్నారు. ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి ధైర్యం చేసి ఆచార్య షూటింగ్ కి వెళ్లబోతే కరోనా పాజిటివ్ వచ్చిందని ..షూటింగ్ ని ఆపేశారు. కానీ చిరూ కి ఎలాంటి వైరస్ లేదని స్వయంగా ఆయనే చెప్పడంతో ఇప్పుడు తన ఆచార్య షూటింగ్ కోసం మెగాస్టార్ సిద్ధమవుతున్నాడు. ఒక్కసారి వచ్చిన తర్వాత ఆగే ముచ్చట ఉండదంటున్నాడు చిరంజీవి. సింగిల్ షెడ్యూల్‌లోనే షూటింగ్ అంతా పూర్తి చేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాడు చిరంజీవి.
లెక్కేసి కొడితే సరిగ్గా ఆర్నెళ్లలో సినిమా థియేటర్స్ లో ఉండాలంటున్నాడు చిరంజీవి. అందుకే కొరటాల శివకు కూడా బల్క్ డేట్స్ ఇచ్చేసాడు చిరంజీవి. నవంబర్ 9 నుంచే ఆచార్య సెట్ప్ పైకి వెళ్తుందనుకున్నా కూడా చిరంజీవికి కరోనా వచ్చిందనే వార్తలు వచ్చాయి. చిరు స్వయంగా తనకు కరోనా వచ్చిందని తెలిపాడు.కానీ అది తప్పుడు రిపోర్ట్ అని రెండు రోజుల తర్వాత తెలిసింది.కరోనా వచ్చిందని తెలియగానే మరో 15 రోజులు వాయిదా పడిందని అర్థమైపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ ప్లాన్స్ అన్నీ మార్చేసాడు కొరటాల శివ. షెడ్యూల్ అంతా సిద్ధం చేసాడు దర్శకుడు కొరటాల. జనవరి వరకు షూటింగ్ మొదలుపెట్టకూడదని ముందు అనుకున్నా కూడా ఇప్పుడు ఫిబ్రవరి లోపు ఆచార్యకు ముగింపు ఇవ్వాలని చూస్తున్నాడు చిరంజీవి.
పాపం ఇప్పటికే కొరటాల రెండేళ్లుగా ఇదే సినిమాపై ఉండటంతో ఇంకా వేచి చూపించకూడదని ఫిక్సయ్యాడు మెగాస్టార్. పైగా కాజల్ కూడా త్వరలోనే షూటింగ్ కు వస్తానంటుంది. నెల రోజుల తర్వాత షూటింగ్ మొహమే చూడనని చెప్పిన చందమామ.. మధ్యలో మనసు మార్చుకుంది. హనీమూన్ నుంచి వచ్చిన వెంటనే ఆచార్య కోసం వచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల శివ కూడా షెడ్యూల్‌కు కావాల్సిందంతా సిద్ధం చేసుకుంటున్నాడు. నవంబర్ చివర్లో మొదలు పెడితే.. ఫిబ్రవరి వరకు అంతా పూర్తి చేయాలని చూస్తున్నాడు.ఇక వచ్చే ఏడాది సమ్మర్ ల్ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: