ప్లీజ్.. అందరూ అలా చేయండి.. లావణ్య త్రిపాఠి రిక్వెస్ట్..?
దీపావళి పండుగ ను అందరూ ఎంతో జాగ్రత్త గా ఆనందం గా జరుపుకోవాలని అంటూ సూచించింది లావణ్య త్రిపాటి. దీపావళి పండుగ సందర్భం గా ప్రతి ఒక్కరు టపాసుల కు వీలైనంత దూరంగా ఉండడం ఎంతో మంచిది అంటూ సూచించింది. అంతేకాకుండా టపాసులు కాల్చడం ద్వారా పెంపుడు జంతువులకు వీధి శునకాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్ల కుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పెంపుడు జంతువులు వీధి శునకాలకు దూరంగా టపాకాయలు కాల్చాలని తెలిపింది లావణ్య త్రిపాఠి.
అయితే స్వయంగా లావణ్య త్రిపాటి అందరికీ అభ్యర్థన చేస్తున్నట్లుగా కాకుండా ఓ వీధి శునకం అందరినీ అభ్యర్థిస్తున్నట్లుగా లావణ్య త్రిపాఠి చేసిన ఈ పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అంతేకాకుండా అందరిని ఆలోచింప చేస్తోంది. ఒక జంతు సంరక్షకులుగా ప్రజలందరూ అవగాహన కల్పించేందుకు సామాజిక స్పృహ పెంచేందుకే ఈ పోస్ట్ పెట్టి నట్లు లావణ్యత్రిపాఠి తెలిపింది. కాగా ప్రస్తుతం లావణ్య త్రిపాటి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సందీప్ కిషన్, కార్తికేయ సినిమాల్లో నటిస్తోంది ఈ అమ్మడు.