దేదీప్యమానంగా దీపాల వెలుగు దీపావళి !

Seetha Sailaja
దేదీప్యమానంగా దీపాలు వెలుగుతూ ఈరోజు దేశంలోని ప్రతి ఇంటిలోనూ వెలిగే దీపం వెనుక అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. ప్రపంచాన్ని జ్ఞాన జ్యోతులతో వెలిగించమని దీపం మనకు కర్తవ్యాన్ని భోధిస్తుంది. ఆధ్యాత్మిక వేత్తలు చెప్పే మాటల ప్రకారం ప్రతిజీవి గుండె లోను ఒక దీపం తలక్రిందులుగా వ్రేలాడుతూ ఒక తామర మొగ్గలా ఉంటుందని అంటారు. ఈ విషయం పై శంకర భాష్యం వివరణ ఉంది.
వాస్తవానికి సూక్ష్మ రూపంలో ఉన్న ఈ దీపాన్ని గుర్తుంచిన వ్యక్తి జీవిత పరమార్ధాన్ని తెలుసుకోగలుగుతాడు. అంతేకాదు పురాతన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరంలోని ఈ దీపం మన శరీరానికి వేడిని రక్తానికి సారాన్ని ఇస్తూ ఆహారాన్ని జీర్ణం చేసేలా పనిచేస్తుంది.


మన పురాణాల ప్రకారం నరకాసుర వధ జరిగిన రోజున దీపావళి అని చెపుతారు. చీకటి తరువాత వెలుగు వస్తుంది కాబట్టి మరునాడు ఉదయం వచ్చే వెలుగుల కోసం స్వాగతం చెపుతూ ఇలా దీపాలను వెలిగించడం మన సనాతన సాంప్రదాయం. దీపం పెట్టాలి అంటే వత్తి చమురు ప్రమిద ఉంటే చాలు అని చాలామంది భావిస్తారు. అయితే మన జ్ఞాన జ్యోతిని వెలిగించి భక్తి భావంతో దీపాన్ని వెలిగించినప్పుడే మనకు మంచిదని అంటారు.


నరకచతుర్ధశి రోజున పెద్దలను తలుచుకుని వారి పేరిట ఒకొక్క దీపాన్ని వెలిగించి వారిని స్వర్గలోకానికి తీసుకు వెళ్ళమని ప్రార్ధిస్తే ఆ వెలుగులే వారికి స్వర్గలోక దారులు చూపెడతాయని పెద్దలు చెపుతూ ఉంటారు. ఈరోజు ధనలక్ష్మీ కుబేరులను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. బంగారం వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు.


ఈరోజు వెలిగించే దీపాలలో నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి అంటారు. ఈ దీపావళి పండుగ ముగాయగానే ‘హరోంహరా’ అంటూ కార్తీక మాసం వచ్చేస్తుంది. అభిషేక ప్రియుడు అయిన శివుడు ని ఈనెల రోజులు పూజిస్తే మన ఆధ్యాత్మిక సాధనాలు మనలను కాపాడుతాయి అని మన నమ్మకం. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటూ మనలో దీప కాంతులను ప్రసరించే ఈ దీపావళి అందరికి ఆనందమయం కావాలని ఇండియా హెరాల్డ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: