ప్రభాస్ చత్రపతి రీమేక్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్..?

praveen
అల్లుడు శీను సినిమాతో  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో కూడిన కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ ఈ యువ హీరో మాత్రం సరైన గుర్తింపు సంపాదించుకోలేక పోయాడు. ఎన్ని  డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలను మాత్రం పొందలేకపోయాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇక జయ జానకి నాయక అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తర్వాత కాజల్ అగర్వాల్ తో  కలిసి సీత అనే సినిమాలో  నటించినప్పటికీ అది ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోయింది.

 అంతకుముందు హారర్ థ్రిల్లర్ సినిమా అయినా రాక్షసుడు అనే సినిమాలో నటించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నటనకు మంచి ప్రశంసలు అందుకోవడం తో పాటు బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ క్రమంలోనే సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు యువ హీరో. కథ బలంగా ఉంటే భారీ బడ్జెట్ సినిమా కాకున్నప్పటి ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు అని రాక్షసుడు సినిమా తో అర్థం చేసుకున్న  యువహీరో ప్రస్తుతం కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన టాక్  ప్రస్తుతం టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.

 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని  ప్రస్తుతం ఫిలింనగర్ కోడై కూస్తోంది. అదికూడా ఒక సంచలన సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్ట  బోతున్నాడట  ఈ యువహీరో. దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చత్రపతి సినిమా టాలీవుడ్ లో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమా హిందీ రీమేక్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాపై అటు ప్రేక్షకులు  కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు సాయి శ్రీనివాస్ నటించిన కొన్ని సినిమాలు హిందీ రీమేక్ లో యూట్యూబ్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: