పునర్నవి కొత్త వెబ్ సిరీస్...ఆకట్టుకుంటుందా...?

VAMSI
బిగ్ బాస్ సీజన్ త్రీ లో అల్లరి చేస్తూ అందరినీ ఆకర్షించింది పునర్నవి... అప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ... బిగ్ బాస్ హౌస్ లో తను చేసిన సందడి..... తను నడుచుకున్న వైఖరికి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు... ముద్దు ముద్దు మాటలతో మనల్ని అలరించిన పున్ను ఇప్పుడు వెబ్ సిరీస్ ''కమిట్ మెంటల్'' తో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ పై ఎన్నో అంచనాలు ఆశల్ని పెట్టుకుంది పున్ను.తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం చిత్రీకరించబడిన ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేశారు.

ఈ మధ్యే ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ సిరీస్ ని అనౌన్స్ చేయడానికి పునర్నవి చేసిన  సందడి అంతా ఇంతా కాదు.  ఈ వెబ్ సిరీస్ ''కమిట్ మెంటల్'' లో పునర్నవి భూపాళం - ఉద్భవ్ రఘునందన్ ప్రధాన పాత్రలలో  కనిపించబోతున్నారు... అయితే పునర్నవి ఈ వెబ్ సిరీస్ లో ఇంత క్యూట్ గా.... బబ్లీగా కనిపించనుంది. నవంబర్ 13 నుంచి 'ఆహా' లో 'కమిట్ మెంటల్' స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో లవ్ యాంగిల్  అద్భుతంగా చూపించారు మేకర్స్. మూడేళ్ళ పాటు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేసి ఫైనల్ గా ఒకటవుదామని నిర్ణయించుకున్న అమ్మాయి అబ్బాయి లా లవ్ స్టోరీ అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

ఒకరు అమెరికాలో మరొకరు ఇండియాలో ఉండటం వల్ల ఒకరినొకరు వ్యక్తిగతంగా పెద్దగా తెలుసుకోలేకపోయారని తెలుస్తోంది. ఆమె కోసం అమెరికా నుండి అతను ఇండియాకి వచ్చిన తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకునే క్రమంలో వారి మధ్య జరిగిన విషయాలను ఎలా పరిష్కరించుకున్నారనేది ఇందులో ఆసక్తిగా చూపించారు. ఈ ట్రైలర్ లో పున్ను డైలాగ్స్ అందరిని ఆకర్షించాయి.... ట్రైలర్ లోని విజువల్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.... అప్పుడు టీజర్ ఇప్పుడు ట్రైలర్ తో మరింత అంచనాలను పెంచింది "కమిట్ మెంటల్" .....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: