వంట మాస్టర్ గా మారిన పూర్ణ.. అసలు మ్యాటరేటంటే?

Satvika
టాలీవుడ్ లో హార్రర్ మూవీస్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న బొద్దు గుమ్మ పూర్ణా.. స్వతహాగా ఈ అమ్మడు కేరళ కుట్టి.. అవును చిత్రం తో మంచి హిట్ టాక్ ను అందుకున్న పూర్ణ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.  సినిమాలలో ఈ మధ్య తక్కువగా కనిపించిన కూడా బుల్లి తెరపై ప్రసారమవుతున్న షో లలో ఎక్కువగా తలుక్కుమంటుంది .మంచి డ్యాన్సర్ గా ఉన్న పూర్ణ ప్రస్తుతం ఢీ షో లో జడ్జిగా వ్యవహరిస్తుంది. ఇది కాక పలు షో లలో కనిపిస్తూ సందడి చేసింది.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం ఈ బొద్దు గుమ్మ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'బ్యాక్‌ డోర్‌'. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది.ఆర్కిడ్‌ ఫిలిం స్టూడియోస్‌ బ్యానర్‌పై బి. శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో యువ హీరో తేజ ఓ ముఖ్య పాత్రను చేస్తున్నారు.


కాగా , హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ను చిత్ర యూనిట్ చిత్రీకరించింది.టైటిల్ కు తగ్గట్లే ఈ సినిమా కూడా ఉండబోతుంది.. ఒక సస్పెన్స్ కథా చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో పూర్ణ పాత్ర ప్రత్యేకమైంది.. మంచి గుర్తింపు లభిస్తుంది. అని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూస్తే సినిమా హిట్ అయ్యేలా ఉందని తెలుస్తుంది..గృహిణి పాత్రలో పూర్ణ కనిపించనుంది..ఈ సినిమా చిత్ర యూనిట్ కు ఖచ్చితంగా అవార్డులను తెచ్చి పెడుతుంది అంటూ పూర్ణ చెప్పుకొచ్చింది. పూర్ణ ఇప్పటివరకు తెలుగులో చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకోవడమే కాదు.  అమ్మడుకు నటనకు పుల్ మార్కులు పడేలా చేశాయి.. మరి ఈ సినిమా ఏ రేంజులో ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: