బిగ్ బాస్ లో నాలుగో వైల్డ్ కార్డ్.. అందరు షాక్ అయ్యేలా స్టార్ సింగర్ ను దించుతున్నారా..?
అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కేవలం అవినాష్ మాత్రమే ఉన్నాడు కాని మిగతా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 4 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇంకా 50 రోజులకు పైగా ఆట ఉంది. అందుకే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌజ్ లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారట బిగ్ బాస్ టీం. ఈసారి స్టార్ సింగర్ మంగ్లీని హౌజ్ లో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇప్పిస్తున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లో మంగ్లీ వస్తే షోకి ఇంకాస్త క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ వారం హౌజ్ లో నుండి ఒకరిని ఎలిమినేట్ చేసి మంగ్లీని హౌజ్ లోకి ఎంట్రీ ఇప్పిస్తారని అంటున్నారు. మరి తప్పకుండా మంగ్లీ వస్తే మాత్రం షోకి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చెప్పొచ్చు. 50 రోజులు మాత్రమే ఆట పూర్తి కాగా ఇంకా సగం షో నడవాల్సి ఉంది. మరి ఈ మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది చూడాలి.