పవన్ , మహేష్ సినిమాల బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదా ...??
వాటిలో ఒకటి వకీల్ సాబ్ కాగా మరొకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా సినిమా. ఇకపోతే మహేష్ బాబు సర్కారు వారి పాట అతి త్వరలో అమెరికాలో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకోనుంది, అలానే దీనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి రాబోయే సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేలా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న క్రిష్ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేసేలా ఆ సినిమా యూనిట్ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి పక్కాగా వచ్చే వేసవి సందర్భంగా అటు సూపర్ స్టార్ ఇటు పవర్ స్టార్ ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక దానిని మరొకటి ఢీ కొనే పరిస్థితి పక్కాగా కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు. అయితే దీనిపై ఆయా సినిమాల యూనిట్స్ నుండి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉందని, ఒకవేళ ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త మాత్రం నిజమే అయితే మాత్రం ఎన్నో ఏళ్ళ తరువాత మరొకసారి పవర్ స్టార్, సూపర్ స్టార్ ల మధ్య బాక్సాఫీస్ వార్ జరగడం ఖాయమని తెలుస్తోంది....!!