చిరంజీవి పవన్ నిర్ణయాల పై మెగా అభిమానుల గగ్గోలు !
ప్రస్తుతం వీరిద్దరూ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి రీమేక్ లకు ఓకె చెబుతూ ఉండటం మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చడంలేదు అన్నప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ మలయాళం హిట్ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లో నటించబోతున్నట్లు అధికారికం ప్రకటించారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకుడు.
అయితే ఇప్పటికే ఓటీటీ స్ట్రీమ్ లో తెలుగు ప్రేక్షకులు విరగబడి చూసిన ‘అయ్యప్పునుం కోషీయుం’ తెలుగులో రీమేక్ చేస్తే ఎవరు చూస్తారు అన్నది పవన్ అభిమానుల ప్రశ్న. దీనికితోడు ఇలాంటి రీమేక్ లను తెలుగు ప్రేక్షకులు చూడరు అన్నది పవన్ అభిమానుల వాదన. అంతేకాదు ఈ మూవీలోని పాత్ర పవన్ కు ఏమాత్రం సరిపోదు అని పవన్ అభిమానుల అభిప్రాయం.
ఇప్పటికే పవన్ రీఎంట్రీ మూవీగా ‘పింక్’ రీమేక్ ను ఎంచుకోవడం పై తీవ్ర అసంతృప్తిలో ఉన్న పవన్ అభిమానులు పవన్ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ లో నటించడం పై సోషల్ మీడియాలో తమ వ్యతిరేకతను దాచుకోకుండా చూపించేస్తున్నారు. మరోవైపు చిరంజీవి కూడ ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్’, ‘వేదాళం’ లాంటి రొటీన్ మాస్ మసాలా సినిమాల రీమేక్ లను లైన్లో పెడుతూ ఉండటంతో మెగా అభిమానులు మెగా బ్రదర్స్ నిర్ణయాల పై తమ అసంతృప్తిని చిరంజీవి పవన్ లకు ఎలా చేరవేయాలో తెలియక తలపట్టుకుంటున్నట్లు టాక్. ఏది ఏమైనా దసరా పండుగ రోజున మెగా అభిమానుల ఉత్సాహాన్ని పవన్ చిరంజీవిలు నీరుకార్చారు..