ఈ కాంబో సినిమా వస్తే అరాచకమే అబ్బా..!

shami
టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయితే అద్భుతాలే జరుగుతాయి. డైరక్టర్ హీరో కాంబో అదిరిపోతే ఆ సినిమా దద్దరిల్లిపోతుంది. ప్రస్తుతం అలాంటి కాంబో ఒకటి సెట్ అవుతుంది. బోయపాటి శ్రీను, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో సినిమా సెట్ అవుతుందని టాక్. ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తర్వాత సైరా అంటూ సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత మెహెర్ రమేష్, బాబి, వినాయక్ డైరక్షన్ లో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా ఉంటుందని టాక్. ఊర మాస్ డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బోయపాటి శ్రీను చిరుతో సినిమా చేస్తే ఆ రచ్చ వేరేలా ఉంటుంది. తప్పకుండా ఈ కాంబినేషన్ లో సినిమా అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.
రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమా నిరాశపరచిన బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరుతో సినిమా ఉంటుందని టాక్. ఇప్పటికే కథ ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. తప్పకుండా అంచనాలను అందుకునేలా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తే రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయం. టాలీవుడ్ మాస్ డైరక్టర్ గా బోయపాటి సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.                                                                          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: