
బిగ్ బాస్ 4 ర్యాపర్ పై వస్తున్న ట్రోల్ల్స్ కి మండిపడుతున్న బిగ్ బాస్ 3 విన్నర్..
ఇప్పటికే ఈ విషయంపై నోయెల్ తమ్ముడు క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ నోయెల్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోల్స్ పై మండిపడ్డాడు సింగర్ రాహుల్ సింప్లిగంజ్. నోయెల్ మంచితనాన్ని తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. నోయెల్ చాలా జెన్యూన్ అని.. తనకు సొంత బ్రదర్ లాంటి వాడని అన్నారు. ట్రోల్స్ అనేవి వస్తూనే ఉంటాయని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. నోయ్ బాగా ఆడుతున్నాడని.. కానీ అతి మంచితనం కనిపిస్తుందని అన్నారు. నోయెల్ కి ఓట్లు వేసి గెలిపించమని కోరాడు.
తన అభిమానులంతా నోయెల్ కి సపోర్ట్ చేయాలని.. నోయెల్ చాలా మంచి వాడని అన్నారు. కానీ అతనిపై ఫేక్ ట్రోల్స్ వస్తున్నాయని.. సింపతీ కోసం ఫేక్ గేమ్ ఆడుతున్నాడని ట్రోల్ చేస్తున్నారని.. తనకు తెలిసిన నోయెల్ సింపతీ కోసం గేమ్ ఆడడని క్లారిటీ ఇచ్చాడు రాహుల్. ఈ ఫేక్ ట్రోల్స్ ని నమ్మొద్దని కోరారు. బయటకి వస్తున్న కంటెస్టెంట్ లంతా కూడా నోయెల్ గురించి పాజిటివ్ గానే చెబుతున్నారని వెల్లడించారు రాహుల్. ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...