జెనీలియా భర్త.. రితేష్ కు కోపం తెప్పించిన ఫ్యాన్స్ కామెంట్స్..!
ఈ నేపధ్యంలో ఆమె సినిమాలను తగ్గించి బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని 2011లో వివాహం చేసుకుంది. అయినా ఆమెకు సౌత్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఒకానొక సందర్భంలో జెనిలియా ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ కు ఆమె భర్త రితేష్ కు చాలా కోపం వచ్చిందట. ఈ విషయాన్ని ఇటీవల కామెడీ విత్ కపిల్ శర్మ షోలో వివరించాడు. ఈ షోలో ఇటీవల రితేష్, జెనీలియా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. రితేష్ జెనీలియా ఫ్యాన్స గురించి మాట్లాడుతూ.. “బెంగళూరులో నేను క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను.అక్కడ ఇద్దరు గుసగుసలాడుకోవడం నేను గమనించాను.
ఆ టైములో నేను వాళ్ళను చూసినప్పుడు.. ‘మీరు జెనీలియా భర్త కదా’ అని అడిగారు. వాళ్ళు అలా అనే సరికి నా ఈగో హర్ట్ అయ్యింది. దాంతో ‘ఇక్కడ నేను జెనీలియా భర్తను అయ్యుండొచ్చు కానీ మహారాష్ట్రలో ఆమె రితేష్ భార్య’ అని చెప్పాను. ఆ మాటకు వాళ్ళు.. ‘సార్ ఆ ఒక్క రాష్ట్రంలోనే.. జెనీలియాను రితేష్ భార్య అంటారు. కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మిమ్మల్ని జెనీలియా భర్త అనే అంటారు’ అని కౌంటర్ ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చాడు రితేష్.