బయటకు వస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది.. అవినాష్ ఇలా అన్నాడేంటి..?
అయితే సోహెల్ ఈ ఒక్కసారి తను సేవ్ చెయమని అడిగాడు. అవినాష్ సోహెల్ ను ఏమి అనలేక బిగ్ బాస్ మీద విరుచుకు పడ్డాడు. నామినేషన్ ఇలా చేయడం ఏమి బాగాలేదని. ఎంతో కష్టపడి ఇక్కడకు వచ్చామని బయటకు వెళ్తే పరిస్థితి ఘోరంగా ఉంటుందని అన్నాడు అవినాష్. అంటే ఒకవేళ నామినేట్ అయినందుకు ఎలిమినేట్ అయితే బయటకు వెళ్లి తాను రోడ్డున పడాల్సి వస్తుందని హింట్ ఇచ్చాడు అవినాష్.
ఎందుకంటే జబర్దస్త్ నుండి అవినాష్ బయటకు వచ్చేశాడు. ఇక దానిలోకి నో ఎంట్రీ అన్నట్టే. కాబట్టి బిగ్ బాస్ లో చివరి వరకు అవినాష్ ఉండాలి అనుకుంటున్నాడు. హౌజ్ లో ఆటపాటలతో తన కామెడీతో అందరిని అలరిస్తున్నాడు అవినాష్. ఒకవేళ నామినేషన్స్ లో ఉన్నా తప్పకుండా అతను సేవ్ అవుతాడు. కామెడీ పీస్ అనుకున్న అవినాష్ ఈమధ్య కొద్దిగా ఫైర్ అవుతున్నాడు. తనంటే ఆడియెన్స్ కు ఇష్టం ఉంది కాబట్టి అతన్ని తప్పకుండా కాపాడుకుంటారు.