అరియానా vs మెహబూబ్.. నామినేషన్ లో ఉండేది ఎవరు..?

shami
మండే అనగానే బిగ్ బాస్ హౌజ్ లో నామినేషన్స్ హంగామా షురూ అవుతుంది. ఎప్పటిలానే ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఈసారి జంటలుగా వెళ్లి ఇద్దరిలో ఒకరు హౌజ్ లో ఉండే అర్హత తమకు ఎందుకు ఉంది.. అవతల వారికి ఎందుకు లేదు అన్నది చెప్పాల్సి ఉంటుంది. అర్హత లేకుండా ఉన్న వారి మీద రంగు పోవాల్సి ఉంటుంది. అయితే ఈవారం నామినేషన్స్ టాస్క్ లో హౌజ్ లో గొడవలు బాగానే అయ్యేలా ఉన్నాయి.

ఇక ఈ వారం నామినేషన్ ప్రాసెస్ లో భాగంగా అరియానా వర్సెస్ మెహబూబ్ ల మధ్య ఫైట్ జరుగనుందని తెలుస్తుంది. ఇద్దరిలో ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు అన్నది వారే తేల్చుకోవాలి కాని ఇద్దరు ఎవరికి వారు తాము బెస్ట్ అని ఫిక్స్ అయ్యారు. మరి ఇలాంటి టైంలో బిగ్ బాస్ హౌజ్ మేట్స్ యొక్క నిర్ణయాన్ని బేస్ చేసుకుని నామినేషన్ జరుపుతాడేమో చూడాలి. అరియానా, మెహబూబ్ ఇద్దరిలో ఇద్దరూ హౌజ్ లో ది బెస్ట్ ఇస్తున్నారు.

అరియానా తన ఆటతీరుతో అందరిని అలరిస్తుంది. తన మార్క్ ఎంటర్టైనర్ గా హౌజ్ లో పర్ఫార్మెన్స్ తో అలరిస్తుంది. ఇక మెహబూబ్ కూడా తన ఆటతో అలరిస్తుంది. ఇద్దరు ఇద్దరే అన్నట్టుగా తమ ఆటతో ఆకట్టుకుంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు నామినేషన్స్ లో ఉంటారన్నది చూడాలి. ఓ పక్క అఖిల్, మోనాల్ ల మధ్య కూడా ఈ నామినేషన్ టాస్క్ ఇరుకున పడేసేలా ఉంది.                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: