ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే..!
ఇది ఇలా ఉండగా 2010లో సింహా తర్వాత అతి పెద్ద హిట్‌గా ఈ మూవీ పొందడం విశేషం. బృందావనం సినిమా విషయానికి వస్తే..... సినిమాకు తగ్గట్టు గానే ఎన్టీఆర్ కాసేపు శ్రీకృష్ణుడిగా పించం, పిల్లనగ్రోవితో కాసేపు కనిపించి అభిమానులను అలరించాడు. ఎన్టీఆర్, కాజల్, సమంతతో జోడీ కట్టిన ఈ మూవీ ఎన్టీఆర్‌కు ఫ్యామిలీస్ లో మంచి ఇమేజ్ తెచ్చింది అనే చెప్పాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. తమన్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
నిజంగా ఈ సినిమా ఎన్ఠీఆర్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఈ 'బృందావనం' మూవీ పలు కేంద్రాల్లో 100 రోజులకు పైగా నడిచింది అంటే ఎంత అద్భుతమో ఊహించొచ్చు. బృందావనం రిలీజ్ అయ్యి 10 యేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగులోనే కాదు ఈ సినిమా కన్నడ, ఒరియా, బెంగాలీ , భోజ్‌పురి, మరాఠీ, వంటి పలు భాషల్లో రీమేక్ చెయ్యడం జరిగింది. అక్కడ కూడా మంచి హిట్స్ ని అందుకుంది. 'బృందావనం' తర్వాత ఎన్టీఆర్ , కాజల్‌తో కలిసి 'బాద్‌షా', టెంపర్' మూవీస్ చేసాడు. జనతా గ్యారేజ్‌లో కాజల్ పక్కా లోకల్ అనే ఐటెం సాంగ్‌లో మెరిసింది.