పిశాచి ఫేమ్ "ప్రయాగ మార్టిన్" భారీ ఆఫర్ కొట్టేసింది...

VAMSI
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది. ప్రముఖ నటులను తెలుగు పరిశ్రమకు అందించారు నటనా సౌర్వభౌముడు దివంగత నటుడు శ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆయన వేసిన బాటలో అందరూ సక్సెస్ అయ్యారు. గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ సరిఅయిన హిట్ కోసం తహతహలాడుతున్నాడు. అయితే తనకు బాగా కలిసొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను  అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరికలయికలో వచ్చిన సింహ మరియు లెజెండ్ ఎంతటి ఘనవిజయాన్ని అందుకున్నాయో వేరే చెప్పక్కర్లేదు.

నటసింహా నందమూరి బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కోసం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది. ఇక ఈ మూవీలో నటించే కథానాయికల కోసం బోయపాటి నిరంతర సెర్చ్ లో ఉన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ కోసం ఎంతోమందిని చూస్తున్నా సెట్ కావడం లేదు. తీరా ఇప్పుడు వీరి చూపు మాలీవుడ్ పై పడింది. గతంలో పిశాచి సినిమాతో విమర్శకుల ప్రసంశలనందుకున్న అందుకున్న మూవీలో నటించిన ప్రయాగ మార్టిన్ ను ఒకహీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది.  

ఇక ఈ మూవీలో బాలకృష్ణ డబుల్ షేడ్ రోల్ చేయనున్న సంగతి తెలిసిందే. ఒక పాత్రలో అఘోరాగా నటించనుండగా...మరో పాత్రలో బిజినెస్ మేన్ గా కనిపించనున్నారని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇంతకీ ఈ మూవీ షెడ్యూల్ ఎప్పటి నుంచి? అన్నదానిపై ఇంకా చిత్ర వర్గం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. షూటింగ్ దసరా తరువాత తిరిగి ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నా.. దానిపై అధికారికంగా క్లారిటీ లేదు. సాహసం శ్వాసగా సాగిపో ఫేం మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.  మరి ఈ సినిమాతో బోయపాటి మరియు బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతారా... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: