నాని మరదలు ఈమేనా...?

Suma Kallamadi
తన నటనతో న్యాచురల్ స్టార్ గా పిలవబడుతున్నాడు నాని. సింపుల్ గా మంచి కామెడీతో ప్రేక్షకులని నవ్విస్తాడు. 2015 ప్రథమార్ధంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం 2017 లో వచ్చిన MCA చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. ఇలా నాని హిట్స్ ని చూస్తేనే ట్యాలెంట్ ఏమిటో తెలిసి పోతుంది. నాని లాక్‌డౌన్ సమయంలో కూడా వి సినిమా తో ప్రేక్షకులని  అలరించడానికి ముందుకు వచ్చాడు.  కానీ అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. భారీ అంచనాలు అందుకో లేక సినిమా హిట్ అవ్వలేక పోయింది.

కానీ నాని  మాత్రం తన నెక్ట్స్ సినిమాలను వరుసగా లైన్లో పెడుతూ దూసుకు పోతున్నాడు. ఇప్పుడు నాని నెక్స్ట్ సినిమా గురించి కూడా ప్రస్తావన మొదలైంది. తన  నెక్ట్స్ సినిమాలో మరదలుగా  హీరోయిన్ నివేదా థామస్ నటించనుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె నాని తో కలిసి పలు సినిమాల లో కూడా నటించింది. వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే జెంటిల్‌మెన్‌, నిన్ను కోరి సినిమాలు వచ్చాయి.

రాబోయే ఈ సినిమా లో నాని  హీరోయిన్‌ పాత్ర కోసం వేరే అమ్మాయిని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా  నానికి మరదలుగా మాత్రం నివేద తో వర్క్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాల పై    ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా హీరోయిన్ నివేద థామస్  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా లోనూ ఆమె ఒక  చిన్న రోల్ చేయనుందంటున్నారు. అలానే ఈ భామ ప్రస్తుతం మళయాళం లో  కూడా రెండు సినిమాలు చేస్తోంది అని తెలుస్తోంది. ఈ అందాల భామ కి ట్యాలెంట్ ఉన్న కూడా  బాగా స్ట్రిక్ట్ అన్న కారణం గానే ఆమెకు ఇక్కడ పెద్దగా అవకాశాలు రావడం లేదన్న సంగతి తెలిసినదే.


  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: