సమంతకు జ్ఞానోదయం కల్గించిన అనుష్క !
‘భాగమతి’ మూవీ తరువాత చాల గ్యాప్ తీసుకుని అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ క్లాస్ మాస్ ప్రేక్షకులలో ఎవర్ని ఆకర్షించక పోవడంతో అనుష్క అంచనాలు తప్పాయి. దీనితో తాను వచ్చే ఏడాది మొదలుపెట్టాలి అని భావిస్తున్న రెండు మూవీ ప్రాజెక్ట్స్ గురించి అనుష్క ఆలోచనలలో పడినట్లు టాక్.
ఇప్పుడు ఈ ప్రభావం సమంత పై చూపించినట్లుగా లీకులు వస్తున్నాయి. గడిచిన ఆరు నెలలుగా ఖాళీగా ఉంటూ డాబా గార్డెన్ యోగా సెషన్స్ లో బిజీగా కాలం గడుపుతున్న సమంత తిరిగి సినిమాల ప్రాజెక్ట్ ల వైపు చూస్తోంది. వాస్తవానికి లాక్‍డౌన్ కు ముందు సమంత అంగీకరించిన చిత్రాల్లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఒక బైలింగ్వల్ ప్రాజెక్ట్ కూడ ఉంది. ఆమూవీ కథ రీత్యా సమంత చెవిటి మూగ పాత్రలో నటించ వలసి ఉంది.
తాప్సీతో ‘గేమ్ ఓవర్’ నయనతారతో ‘మాయ’ చిత్రాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న అశ్విన్ డైరెక్షన్ లో మూవీ తనకు బాగా కలిసి వస్తుందని సమంత నమ్మింది. అయితే లేటెస్ట్ గా విడుదలైన ‘నిశ్శబ్దం’ రిజల్ట్ చూసిన తర్వాత సమంత తన మనసు మార్చుకుందనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఈమూవీ కథ కూడ కొంతవరకు ‘నిశ్శబ్దం’ కథను పోలి ఉండటంతో ఈమూవీ ప్రాజెక్ట్ నుండి ఆమె బయటకు వచ్చినట్లు గాసిప్పులు వస్తున్నాయి.
సమంత ఇచ్చిన ఈ ఊహించని షాక్ తో అశ్విన్ శరవణ్ ఈ కథకు కొన్ని మార్పులు చేసి తాప్సీ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్. దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి ఇక్కడి ప్రేక్షకులు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను ఇంకా పూర్తిగా ఆదరించడం లేదు. దీనితో సమంత తన రూట్ మార్చుకుని తిరిగి టాప్ హీరోల పక్కన గ్లామర్ బ్యూటీగా నటించడానికి రెడీ అవుతున్నా సమంతకు ఏర్పడ్డ అక్కినేని కోడలి ఇమేజ్ కొంతవరకు ఆమె కెరియర్ అవకాశాలకు అడ్డుగా మారుతోంది అన్న అభిప్రాయాలు కూడ మరికొందరు వ్యక్తం చేస్తున్నారు..