సినిమా హాళ్లు తెరిచేది లేదు.. యాజమాన్యాల నిర్ణయం.. ప్రేక్షకులను నిరాశ..?
ఈ క్రమంలోనే సినీ ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడా అని వేయికళ్ళతో ఎదురు చూస్తున్న సినిమా థియేటర్ల ప్రారంభం నేటి నుండి జరగనుంది. 50% కెపాసిటీతో సినిమా థియేటర్లను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు విడుదలకు సిద్ధంగా ఉన్న పలు సినిమాలను సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ఆయా చిత్ర బృందాలు సిద్ధమవుతుండగా... ఇక థియేటర్లను కఠిన నిబంధనల మధ్య నిర్వహించేందుకు యాజమాన్యాలు కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. అటు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం తాము 50% కెపాసిటీతో సినిమా థియేటర్లు నిర్వహించేలా అయితే థియేటర్లు తెరవలేము అంటూ స్పష్టం చేస్తున్నారట. ఇన్ని రోజుల వరకు సినిమా థియేటర్లను మెయింటెన్ చేసి ఎంతో నష్టాల్లో కూరుకు పోయాము అంటూ చెబుతున్న డిస్ట్రిబ్యూటర్లు 50% కెపాసిటీతో సినిమా థియేటర్లు ఓపెన్ చేసి నడిపించడం ఎంతో కష్టతరమైన పని అంటూ చెబుతున్నారట. అందుకే ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా థియేటర్లను తెరవడం లేదు అంటూ సమాధానం ఇస్తున్నారట సినిమా థియేటర్ల యాజమాన్యాలు.