అవినాష్ గరం గరం.. ఏడ్చేసిన సోహెల్..!

shami
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ సీరియస్ అయితే ఎలా ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారా బిగ్ బాస్ హౌజ్ లో అవినాష్ జోకర్ గా ఎంట్రీ ఇచ్చి హౌజ్ లో సరదాగా అందరిని అలరిస్తున్నాడు. అలాంటి అవినాష్ బుధవారం ఎపిసోడ్ లో సీరియస్ అయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా చెయిర్ లో కూర్చున్న అఖిల్ ను చెయిర్ దించే ప్రయత్నం చేయాలి ఆ టైం లో రెడ్ టీం వాళ్లు తలపై ష్యాంపూతో రుద్దారు.. అయితే బ్లూ టీం సభ్యుడు నోయెల్ అఖిల్ కు మొహం మీద టవల్ తో తుడిచాడు. కంట్లో నీల్లు పోకుండా తుడుస్తూ వచ్చాడు.

అయితే ఇదే టైం లో సంచాలకుడిగా సోహెల్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు అవినాష్. సోహెల్ ఒక సైడ్ వారికే సపోర్ట్ చేశాడని.. సేఫ్ గేమ్ ఎవరు ఆడట్లేదని అన్నాడు. అవినాష్ ఫైర్ అవడంతో నాగార్జున ఇచ్చిన మాట కోసం ఏమి మాట్లాడలేదు సోహెల్. తనకు కోపం వచ్చినా సరే ఆపుకున్నాడు. తన కోపాన్ని చెయిర్ మీద చూపించాడు. ఇక డైనింగ్ టేబుల్ మీద చిన్నపిల్లాడిలా ఏడ్చాడు.  

అవినాష్ కోప్పడితే ఇలా ఉంటుందా అని అందరికి అర్ధమైంది. గొడవ పడొద్దని నాగార్జున చెప్పిన కారణంగా సోహెల్ చాలా కంట్రోల్ గా ఉంటున్నాడు. మొత్తానికి హౌజ్ లో తనని మార్చుకునే క్రమంలో సోహెల్ తన కోపాన్ని జయించాలని అనుకుంటున్నాడు. ఆరవ వారం కూడా కెప్టెన్ గా నోయెల్ ఎంపికయ్యాడు. అయితే ఈ టాస్క్ లో భాగంగా నోయెల్ నామినేషన్స్ లో కూడా ఉన్నాడు.                                                       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: