నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు
తాజాగా నందమూరి బాలకృష్ణ తన 60 వ పుట్టిన రోజు వేడుకల్లో మీడియా తో మాట్లాడుతూ, మోక్షజ్ఞ హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని స్పష్టం చేసాడు, అయితే బాల కృష్ణ కొడుకు అంటే తన నుండి అభిమానులు అదిరిపోయే డైలాగులని, ఇంకా డాన్స్ ని ఆశిస్తారు కాబట్టి ప్రస్తుతం మోక్షజ్ఞ డాన్స్ ఇంకా ఫిట్నెస్ పై కాన్సంట్రేట్ చేస్తున్నట్టు సమాచారం..
అయితే అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ మొదటి సినిమాని బాలకృష్ణ, పూరి జగన్నాధ్ తో లాంచ్ చేయబోతున్నాడట, ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న పూరి జగన్నాధ్ మరి నందమూరి మోక్షజ్ఞ కి ఎటువంటి కథ సిద్ధం చేస్తాడో చూడాలి మరి అంతే కాకుండా ఈ సినిమా ని సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మించబోతున్నాడు అనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందొ నందమూరి ఫామిలీ నుండి కన్ఫర్మేషన్ వస్తే తప్ప ఏమి చెప్పలేము .. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 23 ఏళ్ళు, నందమూరి బాలకృష్ణ తన 61 పుట్టినరోజున ఈ సినిమా ప్రారంభించబోతున్నటు సమాచారం..