హీరోయిన్లకు ఎందుకు ఇవ్వడం లేదు !
టాలీవుడ్ లో మొన్న కాక నిన్న వచ్చిన కుర్ర హీరోలు అప్పుడే 2 నుంచి 3కోట్ల రెమ్యునిరేషన్లకు ఎదిగిపోయారు. ఎప్పటి నుంచో లీడింగ్ బ్యూటీలుగా ఉంటున్నవారు ఇప్పటికీ చోటా హీరోలకు ఇచ్చిన మార్క్ ను కూడా కనీసం అందుకోలేకపోతున్నారు. ఇక్కడ నటీమణులు నిర్మాతలను డిమాండ్ చేసి తీసుకోలేక పోతున్నారా లేక నిర్మాతలే హీరోయిన్లకు అంత ఎందుకుఅనుకుంటున్నారా అనేది తెలియడం లేదు. తాజాగా అడవి శేషు, శ్రీవిష్ణు లాంటి యంగ్ హీరోలనే తీసుకుంటే...వీరి అప్పుడే 2 నుంచి 3కోట్లకు ఎదగడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. కాకపోతే వీరి సినిమాల వసూళ్లు , కంటెంట్ కాస్త బెటర్ గా ఉండడం వీరికి ఈ లెక్క వచ్చేలా చేసింది. మరి వీరి తరహాలోనే కాస్త గట్టిగానే వసూళ్లను రాబడుతోన్న లావణ్య త్రిపాటి, అనుపమ, అను ఇమాన్యుయల్ లాంటి హీరోయిన్లకు జస్ట్ 25నుంచి 40లక్షల వరకే ఇస్తున్నారు. ఇంతకుమించిన లెక్కను ఈ హీరోయిన్లకు ఎందుకు ఇవ్వడం లేదు.