అసలు రాజ్ తరుణ్ హీరో ఎలా అయ్యాడో తెలిస్తే షాకవుతారు...?

Chakravarthi Kalyan
డాక్టర్ కాబోయ్ యాక్టర్ అయ్యామని చాలామంది గొప్పలు చెబుతుంటారు సినీఫీల్డులో.. అలాగే చాలా మంది ఏదో అవుదామని వచ్చి ఏదో అయిపోతారు ఈ సినీరంగుల ప్రపంచంలో.. ఇక్కడ పరిస్థితి అలాగే ఉంటుంది. అవకాశం ఏ రూపంలో ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. హీరో రాజ్‌ తరుణ్ పరిస్థితి కూడా అంతేనట. వాస్తవానికి తాను ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చాడట.
కానీ అనూహ్యంగా ఉయ్యాల జంపాల సినిమాతో ఏకంగా  హీరో అయ్యాడు. అది కూడా చాలా యాదృశ్చికంగా జరిగిందట. రాజ్‌ తరుణ్ షార్ట్ ఫిలింస్‌ ద్వారా సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు. ఈ హీరో ఏకంగా 52 షార్ట్‌ ఫిలింస్‌ చేశాడట. ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం వచ్చిందట. ఆ సినిమాకు  స్క్రీన్‌ప్లే, డైలాగ్‌ రాయడంలో కూడా సాయం చేశాడట కూడా.
ఈ సినిమా కోసం హీరోల కోసం వెతుకుతుంటే ఎవరో ఎందుకు నువ్వే చేయొచ్చు కదా అన్నారట నిర్మాతలు..  అలా నటించడానికి ఒప్పుకొన్నాడట.  ‘ఉయ్యాల జంపాల’లో హీరోయిన్‌ పాత్ర చాలా ముఖ్యం. దాని కోసం అమ్మాయిలకు ఆడిషన్స్‌ చేయడం మొదలు పెట్టారట. లోబడ్జెట్‌ ఫిల్మ్‌ కావడంతో అప్పటికి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో రాజ్ తరుణ్ ఒక్కడే ఉండేవాడట. దాదాపు 30మంది అమ్మాయిలను ఆడిషన్‌ చేశారట. వారితో పాటు రాజ్ తరుణ్ కూడా డైలాగ్‌లు చెబుతూ ఉండేవాడట.
అలా రాజ్‌ తరుణ్ చెప్పే విధానం ప్రోడ్యూసర్ కు బాగా నచ్చిందట. అందుకే వెంటనే వేరే వాళ్లు ఎందుకు హీరోగా నువ్వే చేసేయొచ్చు కదా’ అని  అడిగారట. రాజ్ తరుణ్ కూడా హీరోగా ఓకే చెప్పేశాడట. అలా రాజ్ తరుణ్ డైరెక్టర్ కావాల్సిన వాడు అవకాశం కలసి వచ్చి హీరో అయ్యాడు. అందులోనూ ఫస్ట్ సినిమానే హిట్ కొట్టేసాడు. డైరెక్టర్‌, రచయితను అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని.. ఇప్పటికీ ఆ కోరిక అలాగే ఉందని.. ఎప్పటికైనా డైరెక్టర్ ను అవుతానని అంటున్నాడు రాజ్‌ తరుణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: